Share News

వైసీపీ హయాంలోనే జరగాల్సింది కానీ..

ABN , Publish Date - Jan 18 , 2025 | 12:12 AM

వైసీపీ అధికారంలో ఉండగా నే పేపరుమిల్లు కార్మికుల వేతన ఒప్పందం జరగాలని..నాడు పార్టీ అంతర్గత రాజకీయాల కారణంగానే జరగలేదని వైసీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు,రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు.

వైసీపీ హయాంలోనే జరగాల్సింది కానీ..
మాట్లాడుతున్న జక్కంపూడి రాజా

పార్టీ అంతర్గత రాజకీయాలే కారణం

వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాజా

రాజమహేంద్రవరం కల్చరల్‌, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధికారంలో ఉండగా నే పేపరుమిల్లు కార్మికుల వేతన ఒప్పందం జరగాలని..నాడు పార్టీ అంతర్గత రాజకీయాల కారణంగానే జరగలేదని వైసీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు,రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. రాజ మహేంద్రవరం గణేష్‌ చౌక్‌లోని ప్రెస్‌ క్లబ్‌లో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.పేపర్‌మిల్లు కార్మికులకు న్యా యం చేయాలని డిమాండ్‌ చేశారు. పేపర్‌మిల్లు కార్మికులకు గతంలో చేసిన వేతన ఒప్పం దం కంటే తక్కువ చేస్తామనడం సమంజసం కాదన్నారు. ప్రవీణ్‌ చౌదరి అనే వ్యక్తి కారణంగానే కార్మికులకు అన్యాయం జరి గిందన్నారు. పేపర్‌మిల్లు కార్మికులతో తన తండ్రి జక్కంపూడి రామ్మోహనరావుకు గల అనుబంధం కారణంగానే కార్మికుల, న్యాయమైన కోర్కెల సాధనకు తాము మద్దతు ఇస్తున్నామని చెప్పారు. కార్మికుల శ్రమతో లాభాలు గడిస్తున్న యాజమాన్యం న్యాయమైన డిమాండ్లు నెరవేర్చి తీరాలన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గడిచిన సాధారణ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఏ మాత్రం నెరవేర్చకుండా డైవర్షన్‌ పాలిటిక్స్‌ నడుపుతుందని విమర్శించారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో, కోడిపందాలు,పేకాట,గుండాట వంటి జూద శిబిరాలు ఏర్పాటు చేసి కూటమి నాయకులు ప్రజల దగ్గర డబ్డులు దోచేశారని ఆరోపించారు.

Updated Date - Jan 18 , 2025 | 12:12 AM