ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో రాజకీయం
ABN , Publish Date - Feb 13 , 2025 | 12:42 AM
ఉభయగోదావరిజిల్లాల పట్టభద్రు ల నియోజకవర్గానికి జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేసిన నామినేషన్ల ప్రక్రియలో భారీ రాజకీయం జరిగిందని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ఆరోపించారు. రాజమహేంద్రవరం రాజీవ్‌గాంధీ కళాశాలలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

సామాజికవర్గ ఓట్లు చీల్చేందుకు ప్రయత్నం
మాజీ ఎంపీ హర్షకుమార్ ఆరోపణ
రాజమహేంద్రవరం సిటీ, ఫిబ్రవరి 12(ఆం ధ్రజ్యోతి): ఉభయగోదావరిజిల్లాల పట్టభద్రు ల నియోజకవర్గానికి జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేసిన నామినేషన్ల ప్రక్రియలో భారీ రాజకీయం జరిగిందని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ఆరోపించారు. రాజమహేంద్రవరం రాజీవ్‌గాంధీ కళాశాలలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నామినేషన్ల స్ర్కూట్నీ పద్ధతిలో తొలుత పీడీఎఫ్ అభ్యర్థి వీరరాఘవరావు డిస్ క్వాలిఫై అయ్యారని ప్రకటించారని, చివరిలో క్వాలిఫై అయినట్లు లిస్ట్ లో ప్రకటించారని తెలిపారు. పీడీఎఫ్ అభ్యర్థి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారని తా ను కూడా స్వాగతించానని, డిస్ క్వాలిఫై చేసి మళ్లీ క్వాలిఫై చేయడాన్ని బట్టి కుమ్మక్కైనట్లు గా అర్థమవుతోందన్నారు. ఇదంతా పోటీలో ఉన్న తన కుమారుడు జీవీ సుందర్‌కి, వీరరాఘవరావుకు మధ్య ఓట్లు చీల్చడం కోసమే చేశారని ఆరోపించారు.
‘వ్యవస్థలతో కుటిల రాజకీయాలు’
తుని రూరల్, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని కూటమి ప్రభుత్వం కుటిల రాజకీయాలు చేస్తోందని మా జీ ఎంపీ హర్షకుమార్ ఆరోపించారు. తునిపట్టణంతోపాటు గ్రామీణప్రాంతాల్లోని పలు పా ఠశాలల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అ భ్యర్థి జీవీ సుందర్‌తో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు. ఉపాధ్యాయులను, పట్టభద్రులను కలిసి మేనిఫెస్టో వివరించారు. అనంతరం తునిలో మీడియాతో మాట్లాడుతూ నామినేషన్ల సందర్భంగా జరిగిన విషయాన్ని వివరించారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా సుందర్ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దారా సురేష్, తంతటి కిరణ్‌కుమార్, దళిత నాయకులు పాల్గొన్నారు.
పీడీఎఫ్, యూటీఎఫ్‌లపై హర్షకుమార్ వ్యాఖ్యలు సరికాదు
అభ్యర్థులందరి సమక్షంలోనే రాఘవులు నామినేషన్ ఆమోదం
ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఐవీ
కాకినాడ సిటీ, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పీడీఎఫ్, యుటీఎఫ్‌లను విమర్శిస్తూ మాజీ ఎంపీ హర్షకుమార్ వ్యాఖ్యలు చేయడం సరికా దని ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు(ఐవీ) ఖండిం చారు. కాకినాడలోని యుటీఎఫ్ హోంలో బుధ వారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో ఐవీ మాట్లాడుతూ పీడీఎఫ్ ఎల్లప్పుడూ ప్రజాపక్షమేనన్నారు. పీడీఎఫ్, యూటీఎఫ్ అధికార కూటమికి అమ్ముడుపోయాయని ఆధారాలు లేని ఆరోపణలు చేయడం ఆయన స్థాయికి తగదన్నారు. నామినేషన్ ప్రక్రియ ఎన్నికల నిబంధనల ప్రకారమే జరిగిందని, ఇతర అభ్యర్థుల సమక్షంలోనే డీవీ రాఘవులు నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి ఆమోదిం చారని తెలిపారు. పీడీఎఫ్ కులపరమైన అభ్యర్థుల ఎంపిక గానీ, కులపరంగా ఓట్లు అభ్యర్థించడంగానీ చేయదన్నారు. ప్రజాస్వా మ్యబద్ధంగా నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల్లో పీడీఎఫ్ ప్రచారం చేస్తోందన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, అధ్యాపక, కార్మిక, పెన్షన ర్ల, ప్రజా సంఘాల ఉద్యమాల్లో రాఘవులు భాగస్వామలు అయ్యారన్నారు. హర్షకుమార్ తన అభ్యర్థి గుణగణాలు, అర్హతలు ప్రజలకు చెప్పి ఓట్లు అడిగితే బాగుంటుందన్నారు. పీడీఎఫ్ అభ్యర్థిపై హర్షకుమార్ చేసిన వ్యాఖ్య లు ఉపసంహరించుకోవాలని ఐవీ హితవు పలికారు. సమావేశంలో వివిధ ప్రజా సంఘా ల నాయకులు పాల్గొన్నారు.