మధ్యవర్తిత్వంతో త్వరితగతిన ప్రయోజనం
ABN , Publish Date - Jan 07 , 2025 | 12:54 AM
రాజమహేంద్రవరం అర్బన్, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): మధ్యవర్తిత్వం ద్వారా సమయం వృథా కాదని, త్వరితగతిన ప్రయోజనం సమకూరుతుందని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. రాజమహేంద్రవరంలోని జిల్లా న్యాయసేవాధికార సంస్థలో గంధం సునీత ఆధ్వర్యంలో 5 రోజుల పాటు

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత
రాజమహేంద్రవరంలో మధ్యవర్తిత్వ తర్ఫీదు కార్యక్రమం ప్రారంభం
రాజమహేంద్రవరం అర్బన్, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): మధ్యవర్తిత్వం ద్వారా సమయం వృథా కాదని, త్వరితగతిన ప్రయోజనం సమకూరుతుందని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. రాజమహేంద్రవరంలోని జిల్లా న్యాయసేవాధికార సంస్థలో గంధం సునీత ఆధ్వర్యంలో 5 రోజుల పాటు జరిగే మధ్యవర్తిత్వ తర్ఫీదు కార్యక్రమం సోమవారం ప్రారంభించారు. న్యాయమూర్తి సునీత మాట్లాడుతూ దీని వల్ల సామరస్యపూర్వకంగా కేసులను పరిష్కరించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో పర్మినెంట్ లోక్ అదాలత్ చైర్మన్ గాయత్రి దేవి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ప్రకాష్‌బాబు, ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలు, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలకు చెందిన 24 మంది అదనపు జిల్లా న్యాయమూర్తులు, సీనియర్, జూనియర్ న్యాయమూర్తులు ఉన్నారు.