ద్వారపూడి ఆలయంలో పోటెత్తిన అయ్యప్ప భక్తులు
ABN , Publish Date - Jan 16 , 2025 | 01:35 AM
మండపేట మండ లం ద్వారపూడి ఆయ్యప్పస్వామి ఆలయంలో మంగళవారం మకర జ్యోతి దర్శనంతో భక్తులు పుల కించారు.

మండపేట, జనవరి 15 (ఆంధ్రజ్యోతి) మండపేట మండ లం ద్వారపూడి ఆయ్యప్పస్వామి ఆలయంలో మంగళవారం మకర జ్యోతి దర్శనంతో భక్తులు పుల కించారు. ఆలయ ట్రస్టీ ఎస్‌ఎల్ కనకరాజు గురుస్వామి సారధ్యం లో దీన్ని జరిపారు. తొలుత స్వామివారికి సంబంధించిన నగల పెట్టేను గోదావరి ఫణి భూషన్‌స్వామి శిరస్సున ధరించి గురుస్వామి స్వగృహం నుంచి స్వామివారి ఆలయానికి నగల పెట్టేతో ఉరేగింపు జరిపారు. ఉదయం గణపతిహోమం, స్వాముల ఇరు ముడులు, స్వామివారికి అభిషేకా ల అనంత రం సాయంత్రం మకరజ్యోతి దర్శనం జరిగింది. మండపేట ఆలమూరు రోడ్డులో వున్న మాజీ ఎమ్మెల్యే వీవీఎస్‌ఎస్ చౌదరికి చెందిన అయ్యప్పస్వామి ఆలయంలో మంగళవారం మకర జ్యోతి దర్శనం, ఇరుముడుల సమ ర్పణ జరిగాయి. అయ్పప్పస్వామికి బూరులతో అభి షేకం చేశారు. స్వామివారిని దర్శించుకున్న అయ్యప్ప భక్తులు ఇరు ముడులు సమర్పించారు.