డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
ABN , Publish Date - Jan 17 , 2025 | 11:06 PM
రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాజమహేంద్రవరం ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అడిషనల్ ఎస్పీ (లా అండ్ ఆర్డర్) సుబ్బరాజు వాహనం నడిపే సమయంలో డ్రైవర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.

జిల్లా అడిషనల్ ఎస్పీ(లా అండ్ ఆర్డర్) సుబ్బరాజు
రోడ్డు భద్రతపై అవగాహన ర్యాలీ
రాజమహేంద్రవరం అర్బన్/సిటీ, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాజమహేంద్రవరం ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అడిషనల్ ఎస్పీ (లా అండ్ ఆర్డర్) సుబ్బరాజు వాహనం నడిపే సమయంలో డ్రైవర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా ఆర్టీసీ అధికారిణి షర్మిల అశోక, ట్రాఫిక్ డీఎస్పీ వెంకటేశ్వరరావు, ఆర్టీసీ డిపో మేనేజర్ షేక్ షబ్నం, అసిస్టెంట్ మేనేజర్ (ట్రాఫిక్) అజయ్‌బాబు, సిబ్బంది, పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. అలాగే నగరంలో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. వాహనదారు లు తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, నిబంధ నలు అతిక్రమించ రాదని, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరాలని సూచించారు. ర్యా లీలో అడిషనల్ ఎస్పీ, ట్రాఫిక్ డీఎస్పీ,ఆర్టీసీ డ్రైవర్లు, ఆటోడ్రైవర్లు పాల్గొన్నారు.
మద్యం తాగి వాహనాలు నడపొద్దు
కొవ్వూరు, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): మత్తు పానీయాలు తాగి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు అధికంగా జరిగే అవకాశం ఉందని సీఐ పి.విశ్వం అన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా కొవ్వూరు ఆర్టీసీ డిపోలో శుక్రవారం డ్రైవర్లకు డిపో మేనేజర్ వైవీవీఎన్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన విచ్చేసి మాట్లాడారు. డ్రైవ ర్లు విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, కండక్టర్లు సహకరించాలన్నారు. గ్యారేజీ సిబ్బంది మెరుగైన టూల్స్, మెయింటెనెన్స్ ద్వారా బస్సు లు బ్రేక్ డౌన్ అవ్వకుండా చూడాలన్నారు. రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ, మంచి డ్రైవింగ్ నైపుణ్యాలను అలవర్చుకుని ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలన్నారు. డీఎం మాట్లాడుతూ డ్రైవర్ల భద్రత దృష్ట్యా ఏటా జనవరి 16నుంచి ఫిబ్రవరి 15వరకు రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. దీనిలో భాగంగా ఈ నెల 17నుంచి 21వరకు మెయింటెనెన్స్ ఆఫ్ బస్సులు, 22, 23 తేదీల్లో సేఫ్టీ డ్రైవింగ్ అలవెన్సుల అందజేత, 24న డ్రై వర్స్ డే, 25నుంచి 28వరకు రోడ్డు సేఫ్టీ ట్రయినింగ్, 29 నుంచి ఫిబ్రవరి 4 వరకు మెడికల్ ఎక్జామినేషన్, 5,6 తేదీల్లో ఫ్యామిలీ కౌన్సిలింగ్, 7నుంచి 10వరకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు, 11,12 తేదీల్లో రక్తదాన శిబిరాలు, 13,14 రోడ్డు సేఫ్టీ ఆడిట్, 15న ఫెసిలిటేషన్ డే నిర్వహించనున్నట్టు డీఎం పేర్కొన్నారు.