క్యాష్ కొట్టు..లైసెన్స్ పట్టు!
ABN , Publish Date - Oct 18 , 2025 | 01:20 AM
జిల్లాలో పండగొచ్చిందంటే అధికారులకు కాసుల పంట పండాల్సిందే.. లేదంటే చేయి ఊరు కోదు.. జేబు అసలే ఊరుకోదు.. ఏదైనా ప్రభుత్వ పనిచేయాలంటే శాఖల్లో అధికారుల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.
అవినీతి అధికారులకు దీపావళి
మామూళ్లు ఇస్తేనే షాపు లైసెన్స్
జిల్లావ్యాప్తంగా సాగుతున్న దందా
బ్రోకర్‌తో నడిపిస్తున్న వ్యవహారం
410 దుకాణాలకు దరఖాస్తులు
ఒక్కో షాపునకు రూ.30 వేలు డిమాండ్
గగ్గోలు పెడుతున్న తాత్కాలిక వ్యాపారులు
తూర్పుగోదావరి, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పండగొచ్చిందంటే అధికారులకు కాసు ల పంట పండాల్సిందే.. లేదంటే చేయి ఊరు కోదు..జేబు అసలే ఊరుకోదు..ఏదైనా ప్రభుత్వ పనిచేయాలంటే శాఖల్లో అధికారుల మధ్య సమన్వయలోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. కానీ దీపావళి పండుగొచ్చిందంటే మాత్రం ప్రభుత్వ శాఖల అధికారులంతా ఒక్కటై మా మూళ్ల మత్తులో తేలుతుంటారు. ఈ దీపావళికి అధికారులు బాణసంచా వ్యాపారుల నుంచి లక్షలాది రూపాయలు డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. బాణసంచా షాపులు ఏర్పాటుకు రెవెన్యూ, అగ్నిమాపకశాఖ, పోలీస్, జీఎస్టీ ప్రభుత్వ శాఖలు కలిసి తాత్కాలిక బాణసంచా లైసెన్స్ మంజూరు చేయాల్సి ఉంది. ఈ మేరకు ఇప్పటి వరకూ జిల్లా వ్యాప్తంగా 410 దరఖా స్తులు అందాయి.అయితే లైసెన్స్ మంజూరుపై అయోమయం నెలకొంది.
ఎందుకంటే షాపుకో రేటు నిర్ణయించారు. ఊరికో ఆసామి (బ్రోకర్) చాలా సింపుల్‌గా ఒక్కో లైసెన్స్ దరఖాస్తు దారుడి నుంచి కొంత సొమ్ము వసూలు చేసి హోల్‌సేల్‌గా రెవెన్యూ, అగ్నిమాపకశాఖ, పోలీస్, జీఎస్టీ ప్రభుత్వ శాఖల అధికారులకు పంచేసి క్షణాల్లో లైసెన్స్ తెచ్చేస్తున్నాడు. ప్రభుత్వ శాఖల అధికారులు సైతం డబ్బు అందగానే నిబంధ నల ఊసే మరచి అనుమతులు మంజూరు చేస్తున్నారు. సోమవారమే దీపావళి కావడంతో శనివారం నుంచే షాపులు ఆరంభించాల్సి ఉంది. అయితే శుక్రవారం రాత్రి కూడా కొన్ని షాపుల లైసెన్స్‌లపై అయోమయం నెలకొంది.ఇక షాపు లు ఎప్పుడు ఏర్పాటు చేస్తారు.. బాణసంచా విక్రయాలు ఎప్పుడు చేస్తారనేది ఉన్న తాధి కారులకెరుక. కొన్ని షాపులకు మాత్రం అధికా రులు డబ్బులు పట్టేసి పర్మిషన్లు ఇచ్చారని బాణసంచా వ్యాపారులు కోడై కూస్తున్నారు.ఒక్క తూర్పు గోదా వరి జిల్లాలోనే లక్షలాది రూపా యలు చేతులు మారినట్టు బహి రంగంగానే విమర్శలు వెలు ్లవెత్తు తున్నాయి.ఎందుకంటే 410 షాపులకు అక్షరాలా రూ.కోటిపైనే అందనున్నట్టు అంచనా.
చెల్లించాల్సింది రూ.6 వేలు..
ప్రభుత్వం నుంచి తాత్కాలిక బాణ సంచా షాపు లైసెన్స్‌కు వాస్తవానికి చెల్లించాల్సింది అగ్నిమా పక శాఖకు రూ.500 చలానా, రెవెన్యూ శాఖకు రూ.500 చలానా, జీఎస్టీ శాఖకు రూ.5 వేల అడ్వాన్స్ ట్యాక్స్ మొత్తం రూ.6 వేలు చెల్లిస్తే సరి.
చెల్లించేది రూ.30 వేలు..
రెవెన్యూ, అగ్నిమాపకశాఖ, పోలీస్, జీఎస్టీ ప్రభుత్వ శాఖలకు ఒక్కో బాణాసంచా దుకాణం నుంచి రూ.30 వేలు చెల్లిస్తున్నారు. నిడదవోలులో 17 బాణసంచా షాపులకు ఒక్కో షాపునకు రూ. 30 వేల చొప్పున రూ.5.10 లక్షలు అధికారులకు అందుతోంది. ఒక్క కొవ్వూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని చాగల్లు, దేవరపల్లి, గోపా లపురం, కొవ్వూరు, నల్లజర్ల, పెరవలి, తాళ్ళపూడి, ఉండ్రాజవరం, నిడదవోలు లో ఏర్పాటు చేస్తున్న 111 షాపులకు రూ.33.30 లక్షలు దీపావళి బాణసంచా షాపుల లైసెన్స్ దారుల నుంచి అధికారులకు చేతులు మారాయని వ్యాపారులు వాపోతున్నారు.
ఇవి కూడా చదవండి:
ISRO: నవంబరు చివర్లో బ్లూబర్డ్ ప్రయోగం