Share News

జిల్లాలో 92 పోలింగ్‌ కేంద్రాలు

ABN , Publish Date - Feb 15 , 2025 | 12:58 AM

ఉభయగోదావరి జిల్లాల ద్వైవార్షిక పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల పోలింగ్‌ ఈనెల 27న జరుగుతుందని, అందుకు పూర్తి అవగాహనతో సిబ్బంది ఉండాలని జిల్లా రెవెన్యూ అధికారి టి.సీతారామమూర్తి సూచించారు. రాజమహేంద్రవరం ఎస్‌కేవీటీ డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఎన్నికల ప్రిసైడింగ్‌ అధికారులు, సహాయ ప్రిసైడింగ్‌ అఽధికారులకు తొలి విడత శిక్షణ కార్యక్రమం జరిగింది.

 జిల్లాలో 92 పోలింగ్‌ కేంద్రాలు
శిక్షణ తరగతుల్లో మాట్లాడుతున్న డీఆర్వో సీతారామమూర్తి

  • 27న ఎమ్మెల్సీ పోలింగ్‌.. విధుల పట్ల పూర్తి అవగాహన ఉండాలి

  • పీవోలు, ఏపీవోల శిక్షణలో డీఆర్వో సీతారామమూర్తి

రాజమహేంద్రవరం సిటీ, ఫిబ్రవరి 14(ఆం ధ్రజ్యోతి): ఉభయగోదావరి జిల్లాల ద్వైవార్షిక పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల పోలింగ్‌ ఈనెల 27న జరుగుతుందని, అందుకు పూర్తి అవగాహనతో సిబ్బంది ఉండాలని జిల్లా రెవెన్యూ అధికారి టి.సీతారామమూర్తి సూచించారు. రాజమహేంద్రవరం ఎస్‌కేవీటీ డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఎన్నికల ప్రిసైడింగ్‌ అధికారులు, సహాయ ప్రిసైడింగ్‌ అఽధికారులకు తొలి విడత శిక్షణ కార్యక్రమం జరిగింది. దీనికి హాజరైన డీఆర్వో సీతారామమూర్తి మాట్లాడుతూ జిల్లాలో 92 పోలిం గ్‌ కేంద్రాలు ఏర్పాటుచేస్తున్నారని, వాటిలో 102 మంది పీవోలు, 102 మంది ఏపీవోలు నియమించామన్నారు. ప్రధానంగా అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలను ఎమ్మెల్సీ ఎన్నికలతో పోలిస్తే భిన్నంగా ఉంటాయన్నారు. బ్యాలెట్‌ పద్ధ తిలో జరిగే ఎన్నిక కాబట్టి సమయం ఎక్కువ పడుతుందన్నారు. 27న ఉదయం 8 గంటలనుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ సమయం ఉంటుందని, గడువులోపు పోలింగ్‌ కేంద్రం పరిధిలో క్యూలైన్‌లో ఉన్నవారికి వరుస క్రమంలో టోకెన్‌ నెంబర్లు అందించి వారిచే ఓటింగ్‌ జరిపించాలన్నా రు. పోలింగ్‌కు ఒకరోజు ముందుగానే 26న ఉదయం 8గంటలకు ప్రీసైడింగ్‌ అధికారులు తమ బృందాలతో డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్లకు చేరుకోవాలని సూ చించారు. పోలింగ్‌ సామగ్రిని అధికార యంత్రాంగం సమకూర్చిన వాహనం లోనే నిర్దేశిత పోలింగ్‌ కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పోలింగ్‌ కేంద్రంలోకి సెల్‌ ఫోన్లు తీసుకువెళ్లరాదని, వాటికి అనుమతులు లేవన్నారు. పోలింగ్‌ ముగిసిన తర్వాత బ్యా లెట్‌ బాక్సులు తీసుకుని, వాటిని నిర్దేశించిన రిసెప్షన్‌ సెంటర్‌లో అప్పగించాల్సిన బాధ్యత ప్రిసైడింగ్‌ అధికారులదేనని స్పష్టంచేశారు. ఎట్టి పరిస్థితుల్లో బ్యాలెట్‌ పేపర్లు, బ్యాలెట్‌ బాక్సులను పీవో లు తమ పర్యవేక్షణలో తమ వెంటే ఉంచాలన్నారు. అనంతరం పోలింగ్‌ నిర్వహణపై మాస్టర్‌ ట్రైనర్లు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా క్షుణ్ణంగా అవగాహన కల్పించారు. ఈ శిక్షణ తరగతుల్లో కేఆర్‌ఆర్‌సీ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ కె.భాస్కర్‌రెడ్డి, మాస్టర్‌ ట్రైనర్లు, పీవోలు, ఏపీవోలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 15 , 2025 | 12:58 AM