Share News

అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం: గోరంట్ల

ABN , Publish Date - Jan 30 , 2025 | 01:12 AM

ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. మండలంలోని బొమ్మూరు, కాతేరు గ్రామాల్లో ఆయన బుధవారం పర్యటించారు. బొమ్మూరులోని నేతాజీనగర్‌లో జరుగుతున్న పనులను పరిశీలించారు.

అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం: గోరంట్ల
బొమ్మూరులో అభివృద్ధి పనులపై సూచనలిస్తున్న గోరంట్ల

రాజమహేంద్రవరం రూరల్‌, జనవరి 29( ఆంధ్రజ్యోతి): ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. మండలంలోని బొమ్మూరు, కాతేరు గ్రామాల్లో ఆయన బుధవారం పర్యటించారు. బొమ్మూరులోని నేతాజీనగర్‌లో జరుగుతున్న పనులను పరిశీలించారు. అభివృద్ధికి స్థానికులు సహకరించాలని తగాదాలు పడ కూడదన్నారు. కాళీకృష్ణనగర్‌ రోడ్డు నుంచి బృందావన కాలనీ వద్ద దిగేందుకు విశాలమైన రోడ్డు నిర్మిం చేందుకు స్థలాన్ని సర్వే చేసి అంచనాలు సిద్ధం చేయాలన్నారు. 10, 11 వీధులను కలుపుతూ రోడ్డు నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించా రు. కాతేరులోని దాసరి శ్రీనివాసనగర్‌లో ముంపుకు గురౌతున్న ప్రాంతాలను పరి శీలించారు. పేపరుమిల్లు పక్కనున్న ప్ర ధాన మురికి కాలువను విస్తరించేందుకు రెవెన్యూ అధికారులు సర్వే చేసి అంచనాలు సిద్ధం చేయించాలన్నారు. ప్రభుత్వ పుంతలను కూడా సర్వే చేసి ఆక్రమణలు తొలగించాలన్నారు.కాలనీలో మంచినీటి కుళాయిలు ఏర్పా టు చేయాలని పంచాయతీ కార్యదర్శి రాధాకృ ష్ణకు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీని వాసరావు, పంచాయతీ కార్యదర్శి కాశీవిశ్వనాథ్‌, పిఈర్‌ డీఈ రవి, జేఈ సంపత్‌, మత్స్యేటి ప్ర సాద్‌, గంగాన హనుమంతరావు, నున్న కృష్ణ, గంగిన నాని, కురుకూరి కిషోర్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 30 , 2025 | 01:12 AM