Share News

మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట

ABN , Publish Date - Jan 12 , 2025 | 01:06 AM

అభివృద్ధి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్‌, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు.

మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట

రాయవరం, జనవరి 11(ఆంధ్రజ్యోతి): అభివృద్ధి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్‌, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. శనివారం రాయవరం గ్రామంలో పలు అభి వృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం పంచాయతీలను నిర్వీర్యం చేసి సర్పంచ్‌లను బిక్షాటన చేసేలా చేస్తే ప్రభుత్వం పంచాయతీలకు ఆర్థిక పరిపుష్టి ఇచ్చిందన్నారు. గ్రామీణ ప్రాంతాలను ప్రగతిబాటలో నడిపేందుకు మహాత్మాగాంధీ జాతీ య ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామంలో 60 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, మినీ గోకులం షెడ్లు, మెయిన్‌ పాఠశాలలో ఐటీసీ, పెద్దల సహకారంతో నిర్మించిన విద్యార్థుల భోజన భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం స్థానిక చంద్రిక, లక్ష్మీ గణపతి రైస్‌మిల్లుల యాజమాన్యం సహకారంతో ఇచ్చిన 200 కిలోల బియ్యాన్ని పారిశుధ్య కార్మికులకు అందించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకుడు ఉండవిల్లి రాంబాబు, టీడీపీ గ్రామశాఖ అధ్యక్షుడు వెలుగుబంట్ల గోపీకృష్ణ తదితరులతో పాటు ఎంపీపీ నౌడు వెంకటరమణ, సర్పంచ్‌ చంద్రమళ్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2025 | 01:06 AM