Share News

ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంపై హర్షం

ABN , Publish Date - Feb 08 , 2025 | 11:54 PM

ఢిల్లీ ఎన్నికల్లో నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ చారిత్రాత్మక విజయం సాఽధించిందని పార్టీ పట్ట ణాధ్యక్షుడు మోర్త ప్రమోద్‌కుమార్‌ అన్నారు. ఈ నేపధ్యంలో శనివారం నిడ దవోలులోని గణేష్‌చౌక్‌ సెంట రులో బీజేపీ నాయకులు సంబరాలు చేసు కున్నారు. కేక్‌ కట్‌ చేసి బాణసంచా కాల్చి మిఠాయిలు పంచారు.

ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంపై హర్షం
నిడదవోలులో బీజేపీ నాయకుల సంబరాలు

నిడదవోలు, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ ఎన్నికల్లో నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ చారిత్రాత్మక విజయం సాఽధించిందని పార్టీ పట్ట ణాధ్యక్షుడు మోర్త ప్రమోద్‌కుమార్‌ అన్నారు. ఈ నేపధ్యంలో శనివారం నిడ దవోలులోని గణేష్‌చౌక్‌ సెంట రులో బీజేపీ నాయకులు సంబరాలు చేసు కున్నారు. కేక్‌ కట్‌ చేసి బాణసంచా కాల్చి మిఠాయిలు పంచారు. ఈ సం దర్భంగా ప్రమోద్‌కుమార్‌ మా ట్లాడుతూ ఢిల్లీలో బీజేపీ విజ యం నాయకులు, కార్యకర్తల సమష్టి కృషి అని అన్నారు. కే జ్రీవాల్‌పై గెలుపొందిన సింగ్‌ వర్మకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు సీహెచ్‌బీ వెంకటే శ్వరరావు, మోర్త బాలవినోద్‌, ముదునూరి కిషోర్‌రాజు, బండి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

  • మంచికి మద్ధతిచ్చారు: నాగేంద్ర

కొవ్వూరు, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ రాష్ట్రాన్ని అవినీతిమయం చేసిన కేజ్రీవాల్‌ పాలనను ప్రజలు అంతం చేశారని, చెడును వదిలి మంచికి మద్ధతిచ్చారని బీజేపీ జిల్లా అధ్య క్షుడు పిక్కి నాగేంద్ర న్నారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఓటర్లు దేశ ప్రయోజనాలు, రాష్ట్రాభివృద్ధి కోసం ఆలోచించారన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ఢిల్లీ అభివృద్ధి చెందుతుందన్న నమ్మకంతో ఓటేశారన్నారు. బీజేపీ పాలనలో రాష్ట్రంలో సంపూర్ణ అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ ఎన్నికల్లో కష్టపడిన ప్రతి కార్యకర్తకు అభినందనలు తెలియజేశారు.

Updated Date - Feb 08 , 2025 | 11:54 PM