ఆరోగ్యకరమైన సమాజానికి కృషి
ABN , Publish Date - Feb 12 , 2025 | 01:03 AM
భావి భారత పౌరులు ప్రతి ఒక్కరూ ఎలాంటి లోపాలూ లేకుండా సంపూర్ణ ఆరోగ్య వంతులుగా ఉండే విధంగా చర్యలు తీసుకుం టున్నామని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధి కార సంస్థ చైర్‌పర్సన్ గంధం సునీత వెల్లడిం చారు.

24 వరకు ఇంటింటా సర్వే
పీడీజే గంధం సునీత
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 11 (ఆంధ్ర జ్యోతి): భావి భారత పౌరులు ప్రతి ఒక్కరూ ఎలాంటి లోపాలూ లేకుండా సంపూర్ణ ఆరోగ్య వంతులుగా ఉండే విధంగా చర్యలు తీసుకుం టున్నామని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధి కార సంస్థ చైర్‌పర్సన్ గంధం సునీత వెల్లడిం చారు.ఈ మేరకు హైకోర్టు ఆదేశాలతో ప్రతి జిల్లా కేంద్రంలో డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్‌వెన్షన్ సెంటర్(డీఈఐసీ)లను ప్రారంభించడం జరిగిం దన్నారు. రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసి న కేంద్రాన్ని మంగళవారం పరిశీలించి మాట్లా డారు. ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు, డీఎం హెచ్ వో, డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి, ఎంఎల్‌ఎస్‌ఏ కార్యదర్శులతో ఓ బృందాన్ని ఏర్పాటు చేశామ న్నారు. ఈ నెల 10 నుంచి 24వ తేదీ వరకూ కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, ఏఎస్‌ఆర్ జిల్లాలోని డోర్ టు డోర్ క్యాంపెయిన్ ద్వారా దివ్యాంగ పిల్లలను గుర్తించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఆయా ప్రాంతాల్లో రిఫర్ అవుతున్న కేసులు, వాటిపై తీసుకుంటున్న చర్యలను కూడా పర్యవేక్షిస్తామని తెలిపారు. ఒకవేళ వివిధ కారణాల వల్ల దివ్యాంగులను ఇంటి వద్ద ఉంచి వారు పనులకు వెళ్తే అలాంటి పిల్లలను ప్రభుత్వ వాహనంలో ప్రభు త్వాస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అం దించడం జరుగుతుందని పీడీజే వివరిం చారు. జిల్లా కేంద్రాల్లో ఉండే డీఈఐసీ సెంటర్లను ఎప్పటికప్పుడు సందర్శిస్తామని చెప్పారు. ఆరో గ్యకరమైన సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. బాధితులు ఎవరైనా ఉంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలోని చిన్నారుల వైద్య సేవల విభాగాన్ని ఆమె పరిశీలించి సమస్యలపై ఆరా తీశారు. వైద్యాధికారులు,సిబ్బందితో సమీక్షించారు. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి (ఇన్చార్జి) ఎస్‌కే జానీబాషా,స్త్రీ, శిశు సంక్షేమా ధికారి కె.విజయ కుమారి, డీఈఐసీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ డి.హరిశ్చంద్ర ప్రసాద్, పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ఇంద్రజ పాల్గొన్నారు.