Share News

నరికేయడం..వదిలేయడం..

ABN , Publish Date - Feb 17 , 2025 | 12:08 AM

విద్యుత్‌, పంచాయతీరాజ్‌ శాఖల మధ్య సమన్వయం లేకపోవడం ప్రజలకు శాపంగా మారింది. ధవళేశ్వరం విద్యుత్‌ శాఖ పరిధిలో ప్రమాదాలు నివారించడానికి విద్యుత్‌ లైన్ల కింద పెరుగుతున్న చెట్ల కొమ్మలను నరికి తొలగిస్తుంటారు. నరికి వేసిన చెట్లు, కొమ్మలు ఎక్కడవి అక్కడే వదిలి వేయడంతో అవి రోడ్లకు అడ్డంగా ఉండి ప్రమాదాలు జరుగుతున్నాయి.

నరికేయడం..వదిలేయడం..
కొమ్మలను నరికి రోడ్డుపై పడేసిన విద్యుత్‌ సిబ్బంది

  • విద్యుత్‌ శాఖ సిబ్బంది నిర్లక్ష్యం

  • విద్యుత్‌ లైన్లకు అడ్డొస్తున్న చెట్ల కొమ్మల తొలగింపు

  • బయటకు తరలించకుండా రోడ్డును చేర్చి వదిలేస్తున్న వైనం

  • పట్టించుకోని గ్రామ పంచాయతీ అధికారులు

  • ఇబ్బందులు ఎదుర్కొంటున్న ధవళేశ్వరం గ్రామస్థులు

ధవళేశ్వరం, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): విద్యుత్‌, పంచాయతీరాజ్‌ శాఖల మధ్య సమన్వయం లేకపోవడం ప్రజలకు శాపంగా మారింది. ధవళేశ్వరం విద్యుత్‌ శాఖ పరిధిలో ప్రమాదాలు నివారించడానికి విద్యుత్‌ లైన్ల కింద పెరుగుతున్న చెట్ల కొమ్మలను నరికి తొలగిస్తుంటారు. నరికి వేసిన చెట్లు, కొమ్మలు ఎక్కడవి అక్కడే వదిలి వేయడంతో అవి రోడ్లకు అడ్డంగా ఉండి ప్రమాదాలు జరుగుతున్నాయి. కాల్వలో పడి మురుగు ప్రవాహానికి అడ్డంగా మారుతున్నాయి. వార్షిక మరమ్మతుల్లో భాగంగా విద్యుత్‌ లైన్లకు తగులుతున్న కొమ్ములను నరకడంతో పాటు నరికిన కొమ్మలను వాహనం ద్వారా తొలగించాల్సిన విద్యుత్‌ శాఖ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వదిలివేస్తున్నారు. పంచాయతీ పా రిశుధ్య సిబ్బంది రోడ్లకు అడ్డం గా ఉన్న కొమ్మలను పక్కకు లాగి చేతులు దులుపుకుంటున్నారు తప్ప ఊరి చివరకు తరలించడం లేదు. దీంతో గ్రామ వీధుల్లో ఎండిన చెట్ల కొమ్మలు, రాలిన ఆకులతో చెత్తమయంగా మారుతున్నాయి. రోడ్డు పక్కకు చేర్చిన కొమ్మలతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం గ్రామ పంచాయతీ అధికారులతో సమన్వయం చేసుకుని నరికి వేసిన కొ మ్మలు తొలగించాల్సిన పనులను విద్యుత్‌ శాఖాధికారులు చేయాలి. అయితే అలా జరగడం లేదు. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా కాకుండా ఇప్పటికైనా పంచాయతీ, విద్యుత్‌ శాఖల అధికారులు అవగాహనకు వచ్చి కొమ్మలు తొలగించే పనులు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - Feb 17 , 2025 | 12:08 AM