Share News

సంప్రదాయాలకు నెలవు సంక్రాంతి

ABN , Publish Date - Jan 12 , 2025 | 01:08 AM

సం క్రాంతి పండుగ గ్రామీణ సంస్కృతి, సంప్రదా యాలకు నెలవు అని రాష్ట్ర పర్యాటక శాఖా మం త్రి కందుల దుర్గేష్‌ అన్నారు. శనివారం నిడద వోలు మండలం విజ్జేశ్వరంలో పల్లె పండుగ కా ర్యక్రమంలో భాగంగా గ్రామంలో జరిగిన సం క్రాంతి సంబరాల్లో జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాం తితో కలిసి మంత్రి పాల్గొన్నారు.

సంప్రదాయాలకు నెలవు సంక్రాంతి
విజ్జేశ్వరంలో ఎద్దుల బండి నడుపుతున్న మంత్రి దుర్గేష్‌, పక్కనే కలెక్టర్‌

  • పర్యాటక శాఖా మంత్రి దుర్గేష్‌

  • విజ్జేశ్వరంలో పల్లె పండుగ

  • పలు పాఠశాలల్లో సంక్రాంతి ముందస్తు సంబరాలు

నిడదవోలు, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): సం క్రాంతి పండుగ గ్రామీణ సంస్కృతి, సంప్రదా యాలకు నెలవు అని రాష్ట్ర పర్యాటక శాఖా మం త్రి కందుల దుర్గేష్‌ అన్నారు. శనివారం నిడద వోలు మండలం విజ్జేశ్వరంలో పల్లె పండుగ కా ర్యక్రమంలో భాగంగా గ్రామంలో జరిగిన సం క్రాంతి సంబరాల్లో జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాం తితో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ సంక్రాంతి అంటేనే పల్లె పండుగ అని, ఎక్కడెక్కడి వారో స్వగ్రామాలకు చేరుకుని తమవారందరితో పండుగను ఘనంగా చేసుకుంటారన్నారు.అనంతరం గ్రామంలో ఏర్పా టు చేసిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొని గోమా తకు పూజలు నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌ తో కలసి భోగి మంటలు వెలిగించారు. గ్రామం లో జరిగిన ముగ్గుల పోటీలను తిలకిం చారు. పోటీల్లో పాల్గొన్న మహిళలు, చిన్నారులను కలెక్టర్‌ ప్రత్యేకంగా అభినందించారు.

  • నిడదవోలులో ముగ్గుల పోటీలు..

నిడద వోలులోని గాంధీనగర్‌లో స్ర్పింగ్‌ బోర్డు స్కూల్‌, రోటరీ సెంట్రల్‌ ఆధ్వ ర్యంలో సంక్రాంతి సంబ రాల్లో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భం గా జరిగిన సభకు ముఖ్యఅ తిథిగా విచ్చేసిన మున్సిపల్‌ చైర్మన్‌ భూపతి ఆదినారాయణ మాట్లాడుతూ సంక్రాంతి అంద మైన రంగవల్లులకు ప్రతీక అని, మహిళల్లోని సృజనాత్మకతకు ఈ ముగ్గుల పోటీలు అద్దం పడతాయన్నారు. పోటీల్లో పి.మే రీరత్నం, ఎల్‌.మౌన్యశ్రీ, వై.సదాలక్ష్మి, కె.శిరీష మొదటి నాలుగు స్థానాల్లో నిలిచారు. కార్యక్ర మంలో రోటరీ సెంట్రల్‌ అధ్యక్షుడు కొండేపాటి రామకృష్ణ, జీవీఎన్‌ కృష్ణారావు, కంఠమని గోపాలకృష్ణ, బీఎన్‌వీ ప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2025 | 01:08 AM