పంటలకు నీరందేలా కృషి చేస్తా
ABN , Publish Date - Mar 08 , 2025 | 01:09 AM
సూరం పాలెం ప్రాజెక్టుకు చెందిన ప్రధాన కాల్వల ద్వారా నీటిని పారించి దాళ్వా పంటను సంరక్షిం చేందుకు చర్యలు తీసుకుంటానని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. నీటి ఎద్దడితో వెలవెలబోతున్న సూరం పాలెం ప్రాజెక్టును శుక్రవారం ఆయన పరిశీలించారు.
జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ
సూరంపాలెం, భూపతిపాలెం ప్రాజెక్టుల్లో నీటి నిల్వల పరిశీలన
గోకవరం, మార్చి 7(ఆంధ్రజ్యోతి): సూరం పాలెం ప్రాజెక్టుకు చెందిన ప్రధాన కాల్వల ద్వారా నీటిని పారించి దాళ్వా పంటను సంరక్షిం చేందుకు చర్యలు తీసుకుంటానని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. నీటి ఎద్దడితో వెలవెలబోతున్న సూరం పాలెం ప్రాజెక్టును శుక్రవారం ఆయన పరిశీలించారు. మండలం లో పలు గ్రామాల్లో పండిస్తున్న వరి, మొక్కజొన్న పంటలకు సాగు నీరందక ఎండిపోయే దశకు చేరు కున్నాయి. ఈ విషయాన్ని సూరం పాలెం ప్రాజెక్టు చైర్మన్ ఉంగరాల రాము, టీడీపీ నాయకుడు అడపా భరత్ ఎమ్మెల్యే నెహ్రూ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన హుటాహుటీన ప్రాజె క్టును సందర్శించారు. ప్రాజెక్టులో నీటి నిల్వలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు కు నీరు చేరే మార్గాలపై వారితో చర్చించారు. సూరంపాలెం ప్రాజెక్టుకు 18 కిలోమీటర్లు దూరంలో ఉన్న భూపతిపాలెం ప్రాజెక్టు నుంచి నీరొచ్చే అవకాశం ఉందని తెలియజేయడంతో ఆ ప్రాజెక్టును కూడా సందర్శించారు. ఈ సందర్భం గా నెహ్రూ మాట్లాడుతూ భూపతిపాలెం ప్రాజె క్టు నుంచి సూరంపాలెం ప్రాజెక్టుకు నీరు చే రేలా చర్యలు తీసుకుంటానన్నారు. జిల్లా కలెక్టర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి సాగునీటి కొర తను తీరుస్తానన్నారు. ప్రస్తుతం సాగులో ఉన్న పంటలను రక్షించుకునేందుకు కాలువల్లో పూడి కతీత పనులను చేపట్టనున్నట్టు ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, గాజింగం సత్తిబాబు, అడపా వెంకట్రావు, నాగం వెంకటపతి తదితరులు పాల్గొన్నారు.