Share News

రాత్రి గస్తీని బలోపేతం చేద్దాం

ABN , Publish Date - Jan 22 , 2025 | 01:02 AM

ప్రాపర్టీ కేసుల నియంత్రణలో ప్రత్యేక చొరవచూపాలని పోలీస్‌ అధికారులను జిల్లా ఎస్పీ డి.నరసింహకిషోర్‌ ఆదేశించారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన నెలవారీ క్రైమ్‌ రివ్యూ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు.

రాత్రి గస్తీని బలోపేతం చేద్దాం
అవగాహన ర్యాలీ చేస్తున్న ఎస్పీ నరసింహ కిశోర్‌, అధికారులు

రాజమహేంద్రవరం సిటీ, జనవరి 21 (ఆంధ్రజ్యోతి) : ప్రాపర్టీ కేసుల నియంత్రణలో ప్రత్యేక చొరవచూపాలని పోలీస్‌ అధికారులను జిల్లా ఎస్పీ డి.నరసింహకిషోర్‌ ఆదేశించారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన నెలవారీ క్రైమ్‌ రివ్యూ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. విజిబుల్‌ పోలీసింగ్‌, రాత్రి గస్తీని మరింత బలోపేతం చేసి ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ వర్క్‌ పెంచాలని సూచించారు. చోరీలను అరికట్టాలన్నారు. పోలీస్‌ శాఖ పట్ల ప్రజల్లో విశ్వసనీయత పెంపొందేలా ప్రతి ఒక్క రూ విధులు నిర్వర్తించాలన్నారు.ప్రజలతో చాలా మర్యాదగా వ్యవహరించాలన్నారు. మిస్సింగ్‌, పోక్సో, ఎస్టీ ఎస్టీ కేసులపై ఆరా తీశా రు. ఎప్పటికప్పుడు నేరస్తుల వివరాలు కచ్చితంగా అప్‌డేట్‌ చేయాలని ఆదేశించారు. బహిరంగ మద్యపానం, డ్రంకెన్‌ డ్రైవ్‌పై ముమ్మరం గా తనిఖీలు చేపట్టి కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.సారా,గంజాయి రవాణా, విక్రయాలపై ప్రత్యేక దృష్టి పెట్టి దాడులు చేయాలన్నారు. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు సంబంఽధించి ఆయా ప్రాంతాలలోని ప్రజల నుంచి సమాచారం తీసుకుని దాడులు నిర్వ హించాలని ఆదేశించారు. రోడ్డుప్రమాదాలు నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నా రు.సమీక్షలో అడిషనల్‌ ఎస్పీ అల్లూరి వెంకట సుబ్బరాజు, ఏఎస్పీ క్రైమ్స్‌ ఎల్‌.అర్జున్‌, ఏఆర్‌ ఏఎస్పీ ఎల్‌.చెంచిరెడ్డి, ఎస్‌బీ డీఎస్పీ బి.రామకృష్ణ, సీఐలు ఏ.శ్రీనివాసరావు, పవన్‌ కుమార్‌ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

పోలీసుల అవగాహన ర్యాలీ

రాజమహేంద్రవరం సిటీ, జనవరి 21(ఆంరఽధజ్యోతి): ప్రతి వాహనదారుడు రహదారి భద్రతపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్‌ సూచించారు.జాతీయ రహదారి భద్రత మాసోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి జేఎన్‌ రోడ్డు వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. బైక్‌ నడిపేవారు హెల్మెట్‌, కారు నడిపేవారు సీటు బెల్ట్‌ తప్పక పెట్టుకోవాలని, త్రిబుల్‌ రైడిం గ్‌ చేయడం, రాంగ్‌ రూట్‌లో వాహనాలు నడపడం, సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ వాహనాలు నడపడం,ఆటోల్లో మితిమీరి ప్రయాణికులను ఎక్కించుకోవద్దన్నారు.నిబంధనలు పాటించి సు రక్షిత ప్రయాణం చేయాలని సూచించారు.

డీఎస్పీల బాధ్యతల స్వీకరణ

రాజమహేంద్రవరం సిటీ/కోరుకొండ, జనవరి 21( ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని ఈస్ట్‌, నార్త్‌ జోన్ల పరిధిలలో నూతన డీఎస్పీలు బాధ్యతలు స్వీకరించారు. కొత్తగా శిక్షణ పూర్తి చేసుకున్న బి.విద్య ఈస్ట్‌జోన్‌ డీఎస్పీగా, వై.శ్రీకాంత్‌ను నార్త్‌ జోన్‌ డీఎస్పీ లుగా ప్రభుత్వం నియమించింది.ఈ మేరకు మంగళవారం బాధ్యతలు స్వీకరించి జిల్లా ఎస్పీ డి నరసింహకిశోర్‌ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. వారికి ఎస్పీ అభినందనలు తెలిపారు. కోరుకొండలో గుం టూరు జిల్లా తాటికొండకు చెందిన శ్రీకాంత్‌ డీఎస్పీగా తొలి ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. ఇంతకు ముందు సహకారశాఖలో సబ్‌ రిజిస్ట్రార్‌గా రెవెన్యూ డిపార్టుమెంట్‌లో పనిచేశారు. డీఎస్పీగా ఎంపికైన తరువాత కడప జిల్లా జమ్ములమడుగులో ట్రైనింగ్‌ తీసుకున్నారు. గతంలో కోరుకొండ డీఎస్పీగా పనిచేసిన కె. శ్రీనివాసులు అడిషనల్‌ డీఎస్పీగా పదోన్నతి పొందడంతో ఆ స్థానంలో కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్‌ ఇన్‌చార్జ్‌ డీఎస్పీగా కొనసాగారు.

Updated Date - Jan 22 , 2025 | 01:02 AM