దాదాగిరి..దందాలు!
ABN , Publish Date - Feb 03 , 2025 | 12:37 AM
జిల్లాలో రౌడీమూకలు రెచ్చిపోతు న్నాయి.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్ప డుతున్నాయి. అయినా పోలీసులు చూసీ చూడ నట్టు వదిలేస్తున్నారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాజమహేంద్రవరం కేంద్రంగా రౌడీ మూ కలు విచ్చలవిడిగా పెరిగాయి.

ఇంకనూ ఆగని సెటిల్‌మెంట్లు
కూటమి సర్కారులోనూ ఇదే తీరు
కన్నెత్తిచూడని పోలీసులు
రౌడీలకు రాజకీయ రంగు
మళ్లీ భయపడుతున్న జనం
లా అండ్ ఆర్డర్‌కు సవాల్
7 నెలల్లో 70 మందిపై రౌడీషీట్
అయినా మారని తీరు
జిల్లాలో పెరుగుతున్న నేరాలు
రాజమహేంద్రవరం సిటీ, ఫిబ్రవరి 2 (ఆం ధ్రజ్యోతి) : జిల్లాలో రౌడీమూకలు రెచ్చిపోతు న్నాయి.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్ప డుతున్నాయి. అయినా పోలీసులు చూసీ చూడ నట్టు వదిలేస్తున్నారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాజమహేంద్రవరం కేంద్రంగా రౌడీ మూ కలు విచ్చలవిడిగా పెరిగాయి. నగరంలో ఒం టరిగా తిరగాలంటేనే భయపడేంతగా జనం వణికిపోయారు. అమ్మో రాజమహేంద్రవరం అ న్నారు. ఎందుకంటే ఎటు చూసినా బ్లేడ్ బ్యా చ్‌ల ఆగడాలే. కూటమి ప్రభుత్వం రావడంతో ఆ బ్లేడ్ బ్యాచ్‌ల ఆగడాలు తగ్గినా రౌడీమూకల ఆగడాలు మాత్రం అలాగే ఉన్నాయి. అయినా పోలీసులు చూసీచూడనట్టు వదిలేస్తున్నారు.
రెచ్చిపోతున్న రౌడీమూకలు..
ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీకి సంబంధంలేని రౌడీషీటర్లు సైలెంట్‌గా ఉండగా గత ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ అండతో రెచ్చిపోయిన కొంత మంది మాత్రం ఇప్పటికీ చెలరేగిపోయి చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.జిల్లాను అనేక ఘర్షణలకు కేంద్రంగా మార్చివేస్తున్నారు.లాండ్ ఆర్డర్‌కు సవాల్ చేస్తూ అన్ని అసాంఘిక కార్యకలాపాల్లో తలదూర్చి దందాలు చేస్తున్నారు. చిన్న తగాదా మొదలుకొని పెద్దపెద్ద సెటిల్‌మెంట్ల వరకు యథేచ్ఛగా రూల్స్‌ను బ్రేక్ చేస్తున్నారు. పోలీస్ వ్యవస్థను పూర్తిగా వీక్ చేస్తున్నారు. గత ఎన్ని కల్లో నగరంలో ఒకరిద్దరు రౌడీషీటర్లకు గట్టిదెబ్బతగిలింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గొంతులో వెలక్కాయపడినట్లయింది. ఇదంతా కేవలం నెలరోజులు మాత్రమే.. ఎం దుకంటే ఆ నెలా సైలెంట్ అయిన వారు అటుపై మళ్లీ తమ హవా కొనసాగించేందుకు తెరమీదకు వస్తున్నారు. కూటమి ప్రభుత్వం అఽధికారంలో ఉన్నా చాపకింద నీరులా తమ కార్యకలాపాలు నిర్వహించుకుంటున్నారు. రౌడీషీటర్ అనే ముద్రను తొలగించుకునేందుకు వారికి అండగా నిలిచిన పార్టీ పదవులను పొంది ప్రజల్లోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో రోడ్లపై పొడుచుకుని ప్రజలను భయబ్రాంతులకు గురిచేయడమే కాకుండా చాలా మంది మహిళలను భయపెట్టిన చరిత్ర ఉన్న వాళ్ళు వాటిని చెరుపుకునే ప్రయత్నం చేస్తున్నారు.అయితే వారిలో ఉన్న నేర స్వభా వం వారిని ఊరకనే ఉండనివ్వదు కాబట్టి అడ పాదడపా అసాంఘిక పనులు చేసుకుంటూ మళ్లీ తెరపైకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల వైసీపీకి చెందిన రౌడీషీటరు ఒక మహిళను ట్రాప్ చేశారు. ఆ మహిళ చేత ఆమె కుటుంబంలో చిచ్చుపెట్టించి గందరగోళం సృష్టించాడు. చివరికి ఆమెకు ఆమె భర్తకు మధ్య పెద్ద ఆగాధం సృష్టించాడు. ఇటువంటి వారిని అరికట్టడంతో కూటమి ప్రభుత్వం ఊదాసీనంగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. కూ టమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజమహేంద్రవరంలో కొత్తగా సుమారు 70 మం దిపై రౌడీషీట్ ఓపెన్ చేశారు. కానీ గత ఐదే ళ్లలో విచ్చలవిడిగా వ్యవహరించిన వారిపై చర్యలు కానరావడం లేదు. దీంతో రౌడీ మూక లు రెచ్చిపోతున్నాయి..మళ్లీ రోడ్డెక్కుతున్నాయి.