అలరించిన ఆవుల అందాల పోటీలు
ABN , Publish Date - Jan 06 , 2025 | 12:31 AM
మలికిపురం, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): కోనసీమ జిల్లా కేశనపల్లిలో రాష్ట్రస్థాయి ఒంగోలు, పుంగనూరు, గిరి ఆవుల అందాల పోటీలు, ఒంగోలు పాల పోటీలు అలరించాయి. రాష్ట్ర పశుసంవర్థకశాఖ, రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ సహకారంతో అడబాల లక్ష్మీనారాయణ (నాని) నిర్వహించిన ఈ పోటీల్లో 180 వివిధ రకాలకు చెందిన

మలికిపురం, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): కోనసీమ జిల్లా కేశనపల్లిలో రాష్ట్రస్థాయి ఒంగోలు, పుంగనూరు, గిరి ఆవుల అందాల పోటీలు, ఒంగోలు పాల పోటీలు అలరించాయి. రాష్ట్ర పశుసంవర్థకశాఖ, రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ సహకారంతో అడబాల లక్ష్మీనారాయణ (నాని) నిర్వహించిన ఈ పోటీల్లో 180 వివిధ రకాలకు చెందిన ఒంగోలు, పుంగనూరు, గిరి జాతికి చెందిన ఆవులు, గిత్తలు పాల్గొన్నాయి. పాల పోటీల్లో మండపేటకు చెందిన మల్లిపూడి వెంకట్రావకు చెందిన ఒంగోలు ఆవు 16.246 కిలోల పాల దిగుబడితో ప్రథమస్థానం పొందగా అదే రైతుకు చెందిన మరో ఆవు 14.206 కిలోల పాల దిగుబడితో ద్వితీయ బహుమతి పొందింది. ఏలూరుకు రామశింగవరం సర్పంచ్ అడపా శ్రీనివాసరావుకు చెందిన ఒంగోలు ఆవు 14.766 కిలోల దిగుబడితో తృతీయ స్థానం పొందింది. ఒంగోలు ఆవుల అందాల పోటీల్లో ఏలూరు జిల్లా రామశింగవరానికి చెందిన అడపా శ్రీనివాసరావుకు చెందిన ఆవు ప్రథమ స్థానం, ముత్యాల విజయకిరణ్‌కు చెందిన ఆవు ద్వితీయ స్థానం, ముప్పాళ్ల నాగేశ్వరరావుకు చెందిన తృతీయ స్థానంలో నిలిచి బహుమతులు సాధించాయి.
పుంగనూరు ఆవుల అందాల పోటీల్లో భీమవరానికి చెందిన బర్రెడ్డి మణికంఠసతీష్‌కు చెందిన పుంగనూరు ఆవు ప్రథమస్థానం పొందగా కోనసీమ జిల్లా మాచవరానికి చెందిన అడబాల ప్రేమ్‌కుమార్ ఆవు ద్వితీయస్థానం, మండపేటకు చెందిన వి.చక్రవర్తికి చెందిన ఆవు తృతీయస్థానంలో నిలిచాయి. గిరి ఆవుల అందాల పోటీల్లో భీమవరానికి చెందిన బర్రెడ్డి మణికంఠసతీష్‌కు చెందిన ఆవు ప్రథమస్థానం, లక్కవరానికి చెందిన రుద్రరాజు బుజ్జిరాజు ఆవు ద్వితీయ స్థానం, లక్కవరానికి చెందిన అల్లూరి పృధ్విరాజ్‌కు చెందిన ఆవు తృతీయ స్థానాలు సాధించాయి. పుంగనూరు గిత్తల అందాల పోటీల్లో మాచవరానికి చెందిన అడబాల ప్రేమకుమార్‌కు చెందిన గిత్తకు ప్రథమస్థానం, గుమ్మిలేరుకు చెందిన రెడ్డి వీరవెంకటసత్యనారాయణ గిత్తకు ద్వితీయస్థానం, పడమటిపాలేనికి చెందిన గుండాబత్తుల మధుకు చెందిన గిత్తకు తృతీయస్థానం లభించాయి. పోటీల్లో పాల్గొన్న వివిధ రకాల ఆవులను పది విభాగాలుగా విభజించి అన్ని విభాగాల్లోను బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా అడబాల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో జరిగిన సభలో రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాదరావు మాట్లాడుతూ పాడి పంటలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. పోటీలను ఏర్పాటుచేసిన నానినీ అభినందించారు. విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో సర్పంచ్ యెనుముల నాగు, మార్క్‌ఫెడ్ డైరెక్టర్ గుండుబోగుల పెద్దకాపు, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, నర్సాపురం ఎమ్మెల్యే కొత్తపల్లి జానకీరామ్, మాజీ ఎమ్మెల్యే ఎంఏ వేమా, ఎన్డీఏకు నాయకులు పాల్గొన్నారు. విజేతలకు రూ.6లక్షల 50వేలు విలువైన నగదు బహుమతులను అందించారు.