Share News

ఫిర్యాదు చేస్తే రశీదు ఇవ్వాల్సిందే : ఎస్పీ

ABN , Publish Date - Feb 23 , 2025 | 01:57 AM

ఏదో ఒక సమస్యతో తప్పని పరిస్థితుల్లో సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన బాధితులు ఫిర్యాదుచేస్తే రశీదు ఇవ్వాల్సిం దేనని ఎస్పీ జి.బిందుమాధవ్‌ పోలీస్‌ అధి కారులను ఆదేశించారు.

ఫిర్యాదు చేస్తే రశీదు ఇవ్వాల్సిందే : ఎస్పీ

కాకినాడ క్రైం, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): ఏదో ఒక సమస్యతో తప్పని పరిస్థితుల్లో సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన బాధితులు ఫిర్యాదుచేస్తే రశీదు ఇవ్వాల్సిం దేనని ఎస్పీ జి.బిందుమాధవ్‌ పోలీస్‌ అధి కారులను ఆదేశించారు. ఆయన జిల్లా పోలీస్‌ కార్యాలయ, సమావేశ మందిరం లో జిల్లావ్యాప్తంగా ఉన్న పోలీస్‌ అధికారు లతో శనివారం నెలవారీ నేర సమీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వ్యక్తిగత కారణాలతో ఫిర్యా దు చేయడానికి సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాఽధితుల పట్ల అక్కడ సిబ్బం ది, అధికారులు మర్యాదపూర్వకంగా మెలగుతూ వారి సమస్యను సాధ్యమైనంత త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ముఖ్యంగా మహిళల, చిన్నపిల్లల రక్షణకోసం హెల్ప్‌లైన్‌ నెంబర్లను బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శించాలన్నారు. పెం డింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తు త్వరితగతి న పూర్తి చేసేందుకు అత్యాఽధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలన్నారు. ముఖ్యంగా కాకినాడ, పెద్దాపురం సబ్‌డివిజన్ల పరిధిలో నమోదైన గ్రేవ్‌, నాన్‌గ్రేవ్‌, ఆస్తి సంబంధిత నేరాలు, ఇతర కేసుల నమోదు, వాటిని ఛేదించే విషయాలపై స్టేషన్ల వారీగా అధికారులతో సమీక్ష నిర్వహించి సీడీ ఫైల్స్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యంగా రూరల్‌ పోలీస్‌స్టేషన్ల పరిధిలోని గ్రామాలను అధికారులు తప్పనిసరిగా ఎప్పటికప్పుడు సందర్శిస్తూ నిఘాను పటిష్టం చేయాలన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి పోలీస్‌స్టేషన్‌కు ఒక డ్రోన్‌ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. సమావేశంలో అడ్మిన్‌ ఎస్పీ ఎంజేవీ భాస్కర్‌రావు, ట్రైనీ ఏఎస్పీ సుస్మిత, కాకినాడ ఎస్‌డీపీవో, ఐపీఎస్‌ అధికారి మనీష్‌దేవరాజ్‌ పాఠిల్‌, పెద్దాపురం ఎస్‌డీపీవో శ్రీహరిరాజు, ఎస్‌బీ డీఎస్పీ సీహెచ్‌ శ్రీరామకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 23 , 2025 | 01:58 AM