Share News

‘సూర్యఘర్‌’పై విస్తృత ప్రచారం నిర్వహించాలి

ABN , Publish Date - Mar 05 , 2025 | 12:46 AM

అమలాపురం రూరల్‌, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ వినియోగదారులకు చౌకగా సోలార్‌ విద్యుత్‌ను అందించే విధానంపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని ఏపీఈపీడీసీఎల్‌ సీఎండీ ఇమ్మడి పృథ్వితేజ్‌ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్యఘర్‌ పథకంపై విస్తృత ప్రచారం నిర్వహించాల్సిన ఆవశ్యకతను వివరించారు. కోనసీమ జిల్లా భట్లపాలెం బీవీసీ ఇంజనీరింగ్‌ కళాశాలలో జిల్లాలోని విద్యుత్‌శాఖ అధికారులు, సిబ్బందితో మంగళవారం సమీక్షా

‘సూర్యఘర్‌’పై విస్తృత ప్రచారం నిర్వహించాలి
అమలాపురం రూరల్‌ మండలం ఈదరపల్లిలో లైన్‌మెన్‌ దివస్‌ కార్యక్రమంలో పలువురిని సత్కరించిన సీఎండీ పృథ్వితేజ్‌

సోలార్‌ ప్యానల్స్‌ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ

ఏపీఈపీడీసీఎల్‌ సీఎండీ పృథ్వితేజ్‌

అమలాపురం రూరల్‌, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ వినియోగదారులకు చౌకగా సోలార్‌ విద్యుత్‌ను అందించే విధానంపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని ఏపీఈపీడీసీఎల్‌ సీఎండీ ఇమ్మడి పృథ్వితేజ్‌ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్యఘర్‌ పథకంపై విస్తృత ప్రచారం నిర్వహించాల్సిన ఆవశ్యకతను వివరించారు. కోనసీమ జిల్లా భట్లపాలెం బీవీసీ ఇంజనీరింగ్‌ కళాశాలలో జిల్లాలోని విద్యుత్‌శాఖ అధికారులు, సిబ్బందితో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యుత్‌ బిల్లుల బకాయిలు, వసూళ్లపై సమీక్షించారు. సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటుకు కేంద్రం అందిస్తున్న రాయితీపై అవగాహన కల్పించడం ద్వారా సోలార్‌విద్యుత్‌ వాడకాన్ని పెంపొందించి ప్రజలకు తక్కువ ధరకు విద్యుత్‌ అందించే అవకాశం ఉంటుందన్నారు. ప్రధానంగా వేసవి సీజన్‌లో ఎక్కడా లోఓల్టేజీ సమస్య లేకుండా చూడాలని, ట్రాన్స్‌ఫార్మర్లు ఓవర్‌ లోడ్‌ అయితే గుర్తించి అందుకు తగిన యాక్షన్‌ ప్లాన్‌లను సిద్ధం చేసుకోవాలని సూచించారు. సర్కిల్‌ పనితీరును సమీక్షించారు. తొలుత ఈదరపల్లిలోని విద్యుత్‌శాఖ కార్యాలయం వద్ద తూర్పు ప్రాంత విద్యుత్‌ సంస్థ పరిధిలోని ఆపరేషన్‌ సర్కిల్‌లో లైన్‌మెన్స్‌ దివస్‌ను పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో పృథ్వితేజ్‌ పాల్గొన్నారు. అనంతరం సర్కిల్‌ కార్యాలయం ఏర్పాటుకు అనువైన భవనాలను పరిశీలించారు. ఆయా కార్యక్రమాల్లో సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ ఎస్‌.రాజబాబు, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ టెక్నికల్‌ ఎస్‌.నాగేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు కె.రాంబాబు, కె.రత్నాలరాజు, సీనియర్‌ అక్కౌంట్‌ ఆఫీసర్‌ కె.సత్యకిశోర్‌, ఏడీఈ, ఏఈలు పాల్గొన్నారు.

.

Updated Date - Mar 05 , 2025 | 12:46 AM