Share News

సీఎం చంద్రబాబు పర్యటన రద్దు

ABN , Publish Date - Jan 30 , 2025 | 01:31 AM

ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడంతో ఫిబ్రవరి 1న కొవ్వూరు మండలంలోని దొమ్మేరులో జరగవలసిన సీఎం నారా చంద్రబాబు నాయుడు పర్యటన రద్దు అయింది.

సీఎం చంద్రబాబు పర్యటన రద్దు

రాజమహేంద్రవరం, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడంతో ఫిబ్రవరి 1న కొవ్వూరు మండలంలోని దొమ్మేరులో జరగవలసిన సీఎం నారా చంద్రబాబు నాయుడు పర్యటన రద్దు అయింది. పేదల గృహ ప్రవేశాలు ప్రారంభం, పింఛన్ల పంపిణీతోపాటు ఇక్క డ సభ నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి, జిల్లా ఎమ్మెల్యేలు ఈ మేరకు సమీక్షలు నిర్వహించారు. బుధవారం కూడా క్షేత్రస్థాయి సీఎం పర్యటనకు అవసరం ఏర్పాట్లన్నీ సుమారుగా సిద్ధం చేశారు. కానీ ఎలక్షన్‌ కమిషన్‌ పలు ప్రాంతాల్లో పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బుధవారం షెడ్యూల్‌ ప్రకటించి, తక్షణమే కోడ్‌ అమలులోకి వస్తున్నట్టు ప్రకటించింది. కానీ సీఎం ప్రోగ్రాం ముందుగానే నిర్ణయించింది కావడంతో అనుమతి ఇవ్వవలసిందిగా ఎన్నికల సంఘానికి ప్రభుత్వ యంత్రాంగం లేఖ కూడా రాసింది. కానీ కోడ్‌ అమలులోకి రావడం వల్ల సీఎం సభ నిర్వహణ వీలుకాదని, అది కోడ్‌ పరిధిలోకే వస్తుందని ఎన్నికల సంఘం స్పష్టం చేయడంతో ఇక్కడ పర్యటన వాయిదా పడింది. కాగా ఎన్నికలు లేని అన్నమయ్య జిల్లాకు సీఎం సభను మార్చారు.

Updated Date - Jan 30 , 2025 | 01:31 AM