ఆక్రమించెయ్!
ABN , Publish Date - Feb 01 , 2025 | 12:39 AM
చెరువులు చూస్తుంటే గుండె చెరువైపోతోంది.. ఎందుకంటే ఆక్రమణలు లేని ఒక చెరువైనా ఉందా అంటే అనుమానమే.. గత వైసీపీ ప్రభుత్వం భూస్వాముల భూములు ఎలా ఉన్నాయో సర్వే చేసింది కానీ.. చెరువులు పరిస్థితి ఎలా ఉందో సర్వే చేయలేదు.. చేసుంటే తెలిసేది ఆక్రమణలన్నీ అక్కడే ఉన్నాయని.. గత ప్రభుత్వంలోనే చాలా మందికి ఇళ్ల స్థలాలు కూడా ఇచ్చేశారు.. అయినా నేటికీ చెరువులన్నీ ఆక్రమణల మధ్యనే ఉన్నాయి.
మాయమైపోతున్న చెరువులు
పెరిగిపోతున్న ఆక్రమణలు
చెరువులపై కానరాని సర్వే
నీరుగారుతోన్న దాతల ఆశయం
అయినా పట్టని అధికారులు
రాజానగరంలో ఇదీ పరిస్థితి
జిల్లా వ్యాప్తంగానూ ఇంతే
కలెక్టర్‌కు వినతులు
రాజానగరం, జనవరి 31 (ఆంధ్రజ్యోతి) : చెరువులు చూస్తుంటే గుండె చెరువైపోతోంది.. ఎందుకంటే ఆక్రమణలు లేని ఒక చెరువైనా ఉందా అంటే అనుమానమే.. గత వైసీపీ ప్రభుత్వం భూస్వాముల భూములు ఎలా ఉన్నాయో సర్వే చేసింది కానీ.. చెరువులు పరిస్థితి ఎలా ఉందో సర్వే చేయలేదు.. చేసుంటే తెలిసేది ఆక్రమణలన్నీ అక్కడే ఉన్నాయని.. గత ప్రభుత్వంలోనే చాలా మందికి ఇళ్ల స్థలాలు కూడా ఇచ్చేశారు.. అయినా నేటికీ చెరువులన్నీ ఆక్రమణల మధ్యనే ఉన్నాయి. రాజానగరం నియోజకవర్గంలోనే పదుల సంఖ్యలో చెరువులు ఉన్నాయి.ఈ చెరువులదీ ఇదే పరిస్థితి.. ఇకనైనా అధికారులు ఆక్రమణలో ఉన్న చెరువులపై దృష్టి సారించాల్సి ఉంది. దాతల ఆశయం నీరుగారిపోతోంది.. కళ్లెదుటే చెరువులు మాయమైపోతున్నాయి.. నిన్నటి వర కూ ఇక్కడ చెరువు ఉండాలే అనేలా ఆక్రమిం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా తాగు, సాగునీటి చెరువులు అన్యాక్రాంతమైపోతున్నాయి. ఒక ప క్క అభివృద్ధి ముసుగులో అక్రమ మట్టి తవ్వ కాలు, మరోపక్క అక్రమ కట్టడాలతో చెరువులు కుచించుకుపోతున్నాయి. అయినా చెరువులను కబ్జా కోరల నుంచి రక్షించడంలో అధికారులు విఫలమవుతున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభు త్వం జిల్లా వ్యాప్తంగా ఉన్న చెరువుల్లో చేప పిల్లల విడుదలకు సన్నాహాలు చే స్తుంది.. ఈ నేపథ్యంలో చెరువుల విస్తీర్ణంపై సర్వే చేయించి ఆక్రమణల భరతం పట్టాల్సి ఉంది.
చెరువుల ఆక్రమణ..
రాజానగరం మండలం నందరాడ పరి ధిలో అడుసుమిల్లి వెంకయ్యచెరువు (ఏవీ ట్యాంకు) 566 ఎకరాల విస్తీర్ణంలో ఉంది.దీనిలో నరేంద్ర పురం పంచాయతీ పరిధిలో సర్వే నెంబరు 110లో 188.74 ఎకరాలు, నందరాడ పరి ధిలో సర్వే నంబరు 376లో 377.31 ఎకరాల్లో ఉన్న ఏవీ ట్యాంకు నేడు స్వరూపం కోల్పోయి బక్క చిక్కపోయింది. చెరువు గర్భంలో విలువైన భూమిని కొంతమంది సాగు చేసుకుంటుం డగా..మరికొందరు విలువైన మట్టిని రాత్రీప గలు తేడా లేకుండా దోచుకుంటున్నారు. దివా న్‌చెరువులోని తాగునీటి చెరువుగా ఉన్న ఊర చెరువును ఉపాధి హామీ పఽథకంలో లక్ష లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేసినా ఫలి తం లేకపోయింది. సర్వే నెంబరు 1.194లో 5.86 ఎకరాలు,195లో 2.00 ఎకరాలు విస్తీర్ణంలో ఊరచెరువు ఉంది. సర్వే నెంబరు 244లో 10 ఎకరాలు కొత్తచెరువు, సర్వే నెంబరు 283లో 9.52 ఎకరాలు కంచిమూర్తులా చెరువు, సర్వే నెంబరు 315లో 15.22 ఎకరాలు కోలమూరు చెరువు, సర్వే నెంబరు 52లో 8.18 ఎకరాలు పెద్ద చెరువు, సర్వే నెంబరు 53లో 20.24 ఎక రాలు, సర్వే నెంబరు 73లో 3.21 ఎకరాలు యండ్రావారి చెరువులు రికార్డుల్లో నేటికి కూడా నమోదై ఉన్పప్పటికి సహజ సిద్ధం ఆక్రమణల చెరులో కొట్టుమిట్టాడుతున్నాయి. రాజానగరం మండలం ముక్కినాడ పంచాయతీ పరిధిలో ఆక్ర మణకు గురైన చెరువులను పరిరక్షించా లని కోరుతూ జనసేన గ్రామ కమిటీ అధ్యక్షుడు శ్రీరామ్ ఇటీవల రెవెన్యూ సదస్సుల్లో రెవెన్యూ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఇటీవల రాజా నగరం లో కలెక్టర్ పి.ప్రశాంతి నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో నందరాడ చెరు వును ఆక్రమణల నుంచి కాపాడాలని రైతాం గం విన్నవించుకున్నారు.
నియోజకవర్గమంతా ఇంతే..
నియోజకవర్గంలో రాజానగరం, సీతానగరం, కోరుకొండ మండలాల్లో వందలాది ఎకరాల విస్తీర్ణంలో తాగు,సాగునీటి చెరువులు ఉన్నాయి. చెరువుల అభివృద్ధి ముసుగులో గత వైసీపీ ప్ర భుత్వంలో విలువైన మట్టిని జగనన్న కాలనీ లు చదును పేరుతో వైసీపీ నాయకులు అక్ర మంగా తవ్వి జేబులు నింపుకున్నారు. కొన్ని చెరువులను ఆక్రమించేశారు.తాగునీటి అవస రా లకు వినియోగించే చెరువు గట్టుపై ఇప్పటికే ఎవ రికి వారు ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేసి పక్కా భవన నిర్మాణాలు చేపట్టారు.చెరువుల ఆక్ర మణ లకు సంబంధించి సదరు గ్రామస్తులు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించు కోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో పంచాయతీ అధికారులు రెవెన్యూ అధికారులతో సర్వే చేయించి ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఆక్ర మిత స్థలాల్లో నిర్మాణాలు పుట్టు కొస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు సాగు, తాగునీటి చెరు వులపై దృష్టి సారించి,చెరువు భూముల పరిరక్ష ణకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
ముంచేస్తుందమ్మా.. కలెక్టరమ్మా
అడుసుమిల్లి వెంకయ్యచెరువు (ఏవీ ట్యాం కు) ఆయకట్టు పరిధిలో నందరాడ, కలవ చర్ల గ్రామాలకు సంబంధించి సుమారు 1200 ఎకరాలు సాగులో ఉంటుంది. అధిక వర్షాలు,వరదల సమయంలో ఏవీ ట్యాంకులో అవసరమైనప్పుడు వాడుకునేందుకు నీటి నిల్వకు చెరువు కళింగలకు బల్లలతో అడ్డుకట్ట వేయడం పరిపాటి. దీంతో ఎగువ భాగం నరేంద్రపురం పరిధిలోని రైతుల వరి పొలా లు ముంపునకు గురవుతుంటాయి. ఈ విధం గా ప్రతిసారి దాదాపు 100 నుంచి 130 ఎకరా ల్లోని వరి పంట ముంపుబారిన పడుతోంది. తమ పంట పొలాలను ముంపు బారి నుంచి కాపాడాలని అనేకమార్లు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకపోవడంతో ఇటీవల రాజా నగరంలో కలెక్టర్ పి.ప్రశాంతి నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో నరేంద్రపురం రైతాంగం విన్న వించుకున్నారు. తమ రెవెన్యూ పరిధిలో ఏవీ ట్యాంకులో 188 ఎకరాలు ఉన్పప్పటికి ఆదా యం మాత్రం ఫిషర్‌మెన్ సొసైటీ పేరుతో నందరాడకు కట్టబెడుతున్నారని కలెక్టర్‌కు వివరించారు.దీని వల్ల తమ గ్రామానికి ఆదా యం రాకపోగా.. పంట పొలాలు ముంపునకు గురై అన్నదాతలకు తీవ్ర నష్టం వాటిల్లు తుందని వాపోయారు. ఇప్పటి కైనా అధికా రులు దృష్టి సారించి అధిక వర్షాల సమ యంలో చెరువు కళింగలకు అడ్డుకట్ట వేయకుండా.. చేపల ద్వారా వచ్చే ఆదాయం తమ పంచాయతీకి వర్తించేలా చర్యలు చేప ట్టాలని కలెక్టర్ ప్రశాంతికి విజ్ఞప్తి చేశారు.