Share News

మానవజన్మకు ముక్తి ద్వారానే సార్థకత

ABN , Publish Date - Feb 09 , 2025 | 11:27 PM

పిఠాపురం, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): మానవజన్మకు ముక్తి ద్వారా సార్థకత చేకూరుతుందని విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్‌ ఉమర్‌ఆలీషా అన్నారు. పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో 3 రోజుల పాటు జరిగే పీఠం 97వ వార్షిక మహాసభలను పీఠాధిపతి ఉమర్‌ఆలీషా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రా

మానవజన్మకు ముక్తి ద్వారానే సార్థకత
మహాసభలో మాట్లాడుతున్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, చిత్రంలో డాక్టర్‌ ఉమర్‌ఆలీషా

డాక్టర్‌ ఉమర్‌ఆలీషా

వార్షిక మహాసభల్లో పాల్గొన్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

పిఠాపురం, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): మానవజన్మకు ముక్తి ద్వారా సార్థకత చేకూరుతుందని విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్‌ ఉమర్‌ఆలీషా అన్నారు. పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో 3 రోజుల పాటు జరిగే పీఠం 97వ వార్షిక మహాసభలను పీఠాధిపతి ఉమర్‌ఆలీషా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తులనుద్ధేశించి అనుగ్రహభాషణ చేస్తూ జీవాత్మ పరమాత్మగా పరిణామం చెందే అద్భుత అవకాశం మానవజన్మకే ఉందన్నారు. ధర్మ మార్గాన్ని అనుసరించడం ద్వారానే ముక్తిని పొందగలుగుతారని తెలిపారు. ముక్తిని పొందాలంటూ కోరికలు లేని స్థాయికి మానవుడు చేరుకోవాలని, అందుకోసం గురువును ఆశ్రయించి ఆధ్యాత్మిక, తాత్విక జ్ఞానాన్ని గ్రహించాలని చెప్పారు. మానవతా విలు వల పరిరక్షణ కోసం పీఠం పాటుపడుతుందన్నారు.

మహాసభల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సమా జంలో అందరిని కలిపే తత్వం భారతీయ తత్వమన్నారు. నమ్మిన గురువుతో పరిపూర్ణమైన ప్రయాణం చేసే శిష్యుని జీవితం సార్థకమవుతుందని తెలిపారు. మహాసభల నిర్వహణ ద్వా రా ఉమర్‌ఆలీషా మేదోమధనం చేపట్టి మనుషులందరిని కలిపే ప్రయత్నం చేస్తున్నారని ప్రశంసించారు. మహాసభల్లో కాకినాడ జిల్లా మూడవ అదనపు జిల్లా జడ్జి పి.కమలాదేవి, నర్తన రుషి డాక్టర్‌ సప్పా దుర్గాప్రసాద్‌, డాక్టర్‌ హుస్సేన్‌షా, చింతపల్లి అమృతవల్లీ, పీఠం కన్వీనర్‌ పేరూరి సూరిబాబు, సెంట్రల్‌ కమిటీ సభ్యులు డాక్టర్‌ పింగళి ఆనందకుమార్‌, కె.స్వర్ణలత, డాక్టర్‌ ఎన్‌. రామగోపాలవర్మ, ఎన్‌ఆర్‌ఐ సభ్యులు శ్రీనివాస్‌, సూర్యకుమార్‌, ఉషారాణి, జేఎన్‌టీయూకే ప్రొఫెసర్లు డాక్టర్‌ సుమలత, డాక్టర్‌ హరనాథ్‌రాజు ప్రసంగించారు. పీఠం, ఉమర్‌ ఆలీషా రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్టు విశిష్టతలను తెలిపే బ్రోచర్లను ఆవిష్కరించారు.

Updated Date - Feb 09 , 2025 | 11:27 PM