Share News

వెంకన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం

ABN , Publish Date - Mar 07 , 2025 | 01:35 AM

రావులపాలెంలో వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమ య్యాయి.

వెంకన్న  బ్రహ్మోత్సవాలు ప్రారంభం

రావులపాలెం, మార్చి 6(ఆంధ్రజ్యోతి): రావులపాలెంలో వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమ య్యాయి. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు, అష్టోత్తర సహస్రనామ పూజలు, నీరాజన మంత్రపుష్పం తదితర కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో జరిపారు. అనంతరం స్వామి, అమ్మ వార్లకు తిరుచ్చి వాహనసేవ నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు, గోవిందమాలధారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు వీటి ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Updated Date - Mar 07 , 2025 | 01:35 AM