నాటుకోడినీ వదల!
ABN , Publish Date - Feb 13 , 2025 | 12:52 AM
బర్డ్ ఫ్లూ భయపెడుతోంది.. కోళ్ల రైతులు, పెంపకందారులకు కంటిమీద కును కు లేకుండా చేస్తోంది. కరోనా జనంపై ఎంత ప్రభావం చూపిందో ప్రస్తుతం బర్డ్ ఫ్లూ కోడి పై అంత ప్రభావం చూపిస్తుంది..

పెంపకందారుల్లో భయం
అక్కడక్కడా కోళ్లు మృతి
కానూరులో ఫారాలు ఖాళీ
500 నాటుకోళ్లు మృతి
యజమానుల లబోదిబో
శానిటేషన్‌కు చర్యలు
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 12 (ఆంధ్ర జ్యోతి) : బర్డ్ ఫ్లూ భయపెడుతోంది.. కోళ్ల రైతులు, పెంపకందారులకు కంటిమీద కును కు లేకుండా చేస్తోంది. కరోనా జనంపై ఎంత ప్రభావం చూపిందో ప్రస్తుతం బర్డ్ ఫ్లూ కోడి పై అంత ప్రభావం చూపిస్తుంది.. బర్డ్ ఫ్లూ సోకిందంటే అప్పటి వరకూ ఆరోగ్యంగా కని పించిన కోడి క్షణాల్లో మృత్యుఒడికి చేరుతోంది. ఈ వైరస్ లేయర్, బ్రాయిలర్ కోళ్లనే కాదు.. నాటు కోళ్లపై కూడా ప్రభావం చూపుతోంది. దీంతో కోళ్లను పెంచేవారు భయాందోళనకు గురవుతున్నారు.బర్డ్ ఫ్లూ వైరస్ కారణంగా పెరవలి మండలం కానూరు అగ్రహారంలో కోళ్ల ఫారాల్లో కోళ్లన్నీ ఖాళీ అయిపోయాయి. అటు ఫారం ఇటు నాటు కోళ్లు కూడా లేకుం డా పోయాయి. వైరస్ కానూరు అగ్రహారంలో నాటు కోళ్లకూ పాకింది. దీంతో ఇళ్లల్లోని నాటు కోళ్లన్నీ వాటంతట అవే మృత్యువాత పడ్డాయి. ఖరీదైన కోళ్లు కూడా కళ్ల ముందే చనిపోయా యి.వాటిని దూరంగా పాతి పెట్టారు. మొత్తంగా కానూరు అగ్రహారం కోళ్ల ఫాంలలో 84 వేల కోళ్లు మృత్యువాత పడగా.. మిగిలిన 3 వేల వరకూ కోళ్లకు మత్తు మందు ఇచ్చి గోతుల్లో పూడ్చేశారు. మంగళవారం వైరస్ సోకిన 45 నాటుకోళ్లను స్వాధీనం చేసుకొని పూడ్చి పెట్టగా.. బుధవారానికి సుమారు 500 వరకూ నాటుకోళ్లు చనిపోయాయి. ఫారం కోళ్లతో పోలి స్తే వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉండే నాటు కోళ్లకు కూడా వైరస్ ఒకేలా పని చేస్తుందని వెటినరీ వైద్యులు చెబుతున్నారు. ఈ వైరస్ సోకిన వెంటనే తగు జాగ్రత్తలతో కోడిని పాతి పెట్టేయాలి.. లేకపోతే వైరస్ కోళ్ల నుంచి మనుషులకు సంక్రమించే అవకాశం ఉం దన్నారు. కాగా.. బర్డ్ ఫ్లూ వైరస్ సాధారణంగా వలస పక్షుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. వందల వేల కిలోమీటర్ల నుంచి వలస వచ్చే పక్షుల్లో ఈ వైరస్ ఉంటే వాటి విసర్జితాల ద్వారా స్థానికంగా చాలా సులభంగా పాకి పోతుంది. గాలి ద్వారా కూడా బర్డ్ ఫ్లూ వైరస్ విస్తృతమవుతుంది.ఈ వైరస్ అత్యంత వేగంగా సోకడంతో పక్షులు, కోళ్లు గుంపులు గుంపులుగా చనిపోతాయి. ముఖ్య ంగా తగు జాగ్ర త్తలు తీసుకోకపోతే మను షుల ద్వారా ఈ వైరస్ ఎక్కువగా విస్తృత మయ్యే అవకాశం ఇచ్చినట్లే. వైరస్ సోకిన ప్రాంతానికి వెళ్లి అదే వస్త్రాలతో వేరొక చోటికి వెళితే అక్కడి కోళ్లకు ఫ్లూ వస్తుంది. అందువల్ల వైరస్ సోకిన చోటుకు వైద్యులు మినహా ఎవ రూ వెళ్లకూడదు.బర్డ్ ఫ్లూ వైరస్ ఊపిరి తిత్తులు, గాలి వాహికలో తిష్ట వేసి నాశ నం చేస్తుంది.కోళ్లను పాతి పెడితే వాటికి సోకి న వైరస్ భూస్థాపితం అయినట్లేనన్నారు. ముం దస్తు జాగ్రత్తలో భాగంగా గురువారం నుంచి ఫారాల్లో శానిటైజేషన్ చేస్తామని జిల్లా పశు సంవర్థకఅధికారి శ్రీనివాసరావు తెలిపారు.
వైరస్‌తో చనిపోయిన కోళ్లు తినవద్దు!
ఐఎంఏ ప్రతినిధులు
రాజమహేంద్రవరం సిటీ, ఫిబ్రవరి 12( ఆంధ్రజ్యోతి): బర్డ్ ఫ్లూ పట్ల ప్రజలెవరు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాజమహేంద్రవరం అధ్యక్షుడు డాక్టర్ పిడుగు విజయకుమార్ తెలిపారు. రాజమండ్రి ప్రెస్‌క్లబ్‌లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సాధారణంగా వచ్చే దగ్గు, వంటి నొప్పులు, జ్వరం, కండరాలు నొప్పులు వంటిదే బర్డ్ ప్లూ అని చెప్పారు. ఈ లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలన్నారు. కోళ్ళ ఫారాల్లో బర్డ్‌ప్లూ ఉండడంతో ఫారాల్లో పనిచేసేవారికి సోకే అవకాశం ఉం దన్నారు.పౌల్ర్టీ ఫారాల్లో పనిచేసేవారు మా స్కులు, చేతులకు గ్లౌజ్‌లు వేసుకుని పనిచేస్తే వైరస్ బారిన పడరని చెప్పారు. వైరస్‌తో చనిపోయిన కోళ్లను తినకూడదన్నారు. బాగా ఉడికించిన కోడి మాంసం, గుడ్లను తినడం వల్ల ప్రమాదం రాదన్నారు. బర్డ్ ప్లూ మ్యూటేషన్ చెందితే ప్రమాదం ఉంటుందని అయితే ప్రజలు అధిక సంఖ్యలో బర్డ్ ఫ్లూ బారిన పడి నప్పుడే మ్యూటేషన్ అనేది జరుగుతుందన్నారు.ప్రస్తుతం భయపడాల్సిన పనిలేదన్నారు.సమావేశంలో ఐఎంఎ ప్రతినిధులు డాక్టర్ గుప్తా, డాక్టర్ వడ్డాది సురేష్, డాక్టర్ శేషాద్రి రెడ్డి, డాక్టర్ పాండురంగరాజు,డాక్టర్ సుమన్, డాక్టర్ ప్రియాంక పాల్గొన్నారు.