కోడికి కష్టమొచ్చింది!
ABN , Publish Date - Feb 12 , 2025 | 01:02 AM
కోడికి కష్టమొచ్చింది.. వైరస్ దెబ్బకు ఓడిపోయింది.. కోడిని చూస్తేనే జనం పరుగుపెడుతున్నారు.. రెండు రోజుల కిందట వరకూ కోడిని చూసి లొట్టలేసిన వారు.. ప్రస్తుతం చికెన్ తినాలా! వద్దా!.. అనే మీమాంసలో పడిపోయారు.. ఎందుకంటే బర్డ్ ఫ్లూ భయపెడుతోంది..

మూడు జిల్లాలపై తీవ్ర ప్రభావం
పడిపోయిన అమ్మకాలు
ఒక్కసారిగా దిగజారిన గుడ్డు ధర
లబోదిబోమంటున్న పౌలీ్ట్ర రైతులు
అప్రమత్తమైన అధికారులు
ఎక్కడికక్కడ కట్టడికి చర్యలు
కాకినాడలో ర్యాపిడ్ టీమ్‌లు
పచ్చి మాంసం తింటేనే ప్రమాదం
ఆఫ్ బాయిల్డ్ ఎగ్ తినకూడదు
ఉడకబెడితే తినొచ్చంటున్న వైద్యులు
(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)
కోడికి కష్టమొచ్చింది.. వైరస్ దెబ్బకు ఓడిపోయింది.. కోడిని చూస్తేనే జనం పరుగుపెడుతున్నారు.. రెండు రోజుల కిందట వరకూ కోడిని చూసి లొట్టలేసిన వారు.. ప్రస్తుతం చికెన్ తినాలా! వద్దా!.. అనే మీమాంసలో పడిపోయారు.. ఎందుకంటే బర్డ్ ఫ్లూ భయపెడుతోంది.. తినకపోవడమే మంచిదనే అభిప్రాయంలో జనం ఉన్నారు.. దీంతో మంగళవారం చికెన్ దుకాణాలు వెల వెలబోయాయి.. పౌలీ్ట్ర రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.. ఉభయగోదావరి జిల్లాల్లో పౌలీ్ట్ర యజమానులు లబోదిబో మంటున్నారు.. అయితే యానిమల్ హజ్బెండరీ అధికారులు మాత్రం ఉడకబెట్టిన తరువాత చికెన్ తిన్నా ఇబ్బందేంలేదని చెబుతున్నారు.. గతంలోనూ ఉభయ గోదావరి జిల్లాల్లో బర్డ్‌ఫ్లూ వచ్చింది.. అప్పుడు ఎవరికైనా సోకిందా అని ప్రశ్నిస్తు న్నారు.. దీంతో పచ్చిమాంసం తింటే ప్రమా దమే కానీ.. ఉడకబెట్టిన తరువాత తింటే ప్రమాదమేం లేదనేది చాలామంది వాదన.. తూర్పుగోదావరి జిల్లా కానూరు అగ్రహా రంలో కోళ్లకు బర్డ్‌ఫ్లూ నిర్ధారణ కావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కానూరు అగ్రహారంలో రెడ్ అలర్ట్ ప్రకటించడంతో పాటు ప్రజలను అప్రమత్తం చేశారు. వాస్త వానికి జనవరి నుంచే ఇక్కడ కోళ్లు చనిపో తున్నట్టు చెబుతున్నారు. సుమారు 54 వేల కోళ్లు మృతిచెందిన తర్వాత పౌల్ర్టీ యజమాని జిల్లా యంత్రాంగానికి సమాచారం ఇవ్వడంతో కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశాల మేరకు శాంపిల్స్ తీసి పరీక్షించడంతో బర్డ్‌ఫ్లూ బయటపడింది. ఇప్పటి వరకూ మొత్తం 84 వేల కోళ్లు ఇక్కడ మృతి చెందినట్టు ఓ అధికారి తెలిపారు. మం గళవారం వైద్య సిబ్బంది మిగిలిన 2,976 కోళ్లకు మత్తు ఇచ్చి గోతుల్లో పూడ్చేశారు. గ్రామ ప్రజలు పెంచుకుంటున్న సుమారు 45 కోళ్లను కూడా స్వాధీనం చేసుకుని, వాటిని కూ డా పూడ్చిపెట్టారు. ఈ గ్రామంలో 2700 మంది జనాభా ఉన్నారు. మూడు ప్రధాన కోళ్ల ఫారాలతోపాటు మరో ఆరు వరకూ ఫారాలు ఉన్నాయి. జిల్లా యంత్రాంగం పూర్తిగా ఇక్కడ దృష్టి కేంద్రీకరించింది. వైద్యశాఖ అధికారులు ప్రతి మనిషి నుంచి శాంపిల్ తీసుకుని ల్యా బ్‌కు పంపించారు. ఊరిలో ఎవరూ కోడి మాం సం, గుడ్లు తినవద్దని టాంటాం వేసినట్టు స ర్పంచ్ దాసం వెంకన్న తెలిపారు. కిలో మీట రు లోపు రెడ్ అలర్ట్ ప్రకటించడంతో ఇక్కడ అందరూ అప్రమత్తంగా ఉండేటట్టు చర్యలు తీసుకున్నారు. ఇక్కడ కోళ్లఫారాల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఎటువంటి వైరస్ లక్షణాలు కనిపించలేదని అధికారులు చెబుతున్నారు.
34 గ్రామాల్లో సర్వే : కలెక్టర్
నిడదవోలు నియోజకవర్గం పెరవలి, ఉం డ్రాజవరం, నిడదవోలు మండలాల పరిధి లోని 34 గ్రామాల్లో ఇంటింటికీ సర్వే చేసి బర్డ్‌ఫ్లూ వ్యాధి లక్షణాల ఎవరికైనా ఉన్నా యేమో అనే సర్వే చేయడం కోసం 64 వైద్య బృందాలను నియమించాం. సీతా నగరం మండలంలో కూడా సర్వే చేయి న్నాం. ఇతర యానిమల్స్‌కు వైరస్ సోక కుండా వాక్సినేషన్ చేయిస్తున్నాం. అపో హలు వద్దు, జాగ్రత్తలు తీసుకోవడం మం చిదని, ఇంతవరకూ జిల్లాలో మనుషులెవ రికి ఈ వ్యాధి సోకినట్టు దాఖలాలు లేవు. కానూరు నుంచి కోళ్లు, గుడ్లు బయటకు వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాం. వివిధ శాఖల అధికారులతో కలిసి మంగళ వారం కలెక్టర్ కానూరులో పర్యటించారు.
కోనసీమలో వైరస్ లేదు!
(అమలాపురం-ఆంధ్రజ్యోతి)
బర్డ్‌ఫ్లూ ప్రచారంపై డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని పౌల్ర్టీ పరిశ్రమకు చెందిన యజమానులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతానికి జిల్లా పరిధిలో ఎక్కడా బర్డ్ ఫ్లూ ప్రభావం లేనప్పటికీ ప్రచార ప్రభావంతో ప్రజలు ముం దస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దాంతో కోళ్లు ఆధారంగా నడిచే నాన్‌వెజ్ హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో చికెన్ వినియోగం తగ్గుముఖం పట్టింది. చికెన్ దుకాణాలపై ఈ ప్రభావం పడి అమ్మ కాలు తగ్గుముఖం పట్టాయి. జిల్లావ్యాప్తంగా మండపేట, రామచంద్రపురం, కొత్తపేట నియోజకవర్గాల పరిధితోపాటు వివిధ ప్రాంతాల్లో 57 లక్షలకుపైగా కోళ్ల పెంపకం జరుగుతున్నట్టు పశు సంవర్థకశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ ఇవ్వకపోవడం వల్లే కోళ్లకు బర్డ్‌ఫ్లూ వ్యాధి సోకి ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. కోనసీమ జిల్లాలో కోళ్లకు వ్యాక్సినేషన్ చేయడం వల్ల ఆ తరహా వ్యాధిలేమీ సోకలేదనేది అధికారుల వాదన. ఒక కోడికి వేసే వ్యాక్సిన్ ఖర్చు రూ.2 నుంచి రూ.10 అవుతుంది. దీంతో కొందరు వ్యాక్సినేషన్ వేయకపోవడంతో ఈ తరహా వైరస్ సోకుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పౌల్ర్టీ సంఘ యజమానులు మాత్రం కోనసీమ జిల్లాలో ఎక్కడా వైరస్ లక్షణాలు లేవని.. చికెన్ వినియోగించవచ్చని ప్రచారం చేస్తున్నారు.
కోనసీమలో ఆనవాళ్లు లేవు : కలెక్టర్
కోనసీమ జిల్లాలోని 18 పౌల్ర్టీల్లో 57 లక్షలకు పైగా కోళ్లు ఉన్నాయి.. ఇప్పటివరకు బర్డ్‌ఫ్లూ ఆనవాళ్లను గుర్తించలేదు.. పక్క జిల్లాల్లో బర్డ్‌ఫ్లూ ఉన్న దృష్ట్యా పౌల్ర్టీ యజమానులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలి. వారం రోజులపాటు జిల్లాలో అంగన్‌వాడీలు, పాఠశాలలు, హాస్టళ్లకు కోడిగుడ్ల సరఫరా నిలిపివేయాలి. అమలాపురం కలెక్టరేట్‌లో మంగళవారం కలెక్టర్ మహేష్‌కుమార్ అధికారులతో బర్డ్ ఫ్లూపై సమీ క్షించి పలు సూచనలు చేశారు.
కాకినాడలో అలెర్ట్
(కాకినాడ-ఆంధ్రజ్యోతి)
బర్డ్‌ఫ్లూతో కోళ్లు మృత్యువాత పడుతున్న నేపథ్యంలో కాకి నాడ జిల్లా పశుసంవర్థక శాఖ అప్రమత్తమైంది. జిల్లావ్యా ప్తంగా ఉన్న కోళ్ల ఫారాల్లో తనిఖీలు చేయాలని సిబ్బందిని ఆదేశించింది. ఈ మేరకు ప్రతి మండలానికి రెండు చొప్పున ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను ఏర్పాటు చేసింది. ఇందులో ఆయా సచివాలయాల్లో పనిచేసే పశుసంవర్థక శాఖ సిబ్బం దిని భాగస్వామ్యం చేసింది. ఈ బృందాలు మంగళవారం నుంచి గ్రామాల్లో కోళ్లఫారాలను తనిఖీ చేయించింది. ఎక్క డైనా కోళ్లు మృత్యువాత పడినట్టు గుర్తిస్తే తక్షణం ఆ ప్రాం తానికి కిలోమీటరు పరిధిలో ప్రజలను అప్రమత్తం చేయా లని ఆదేశించింది. దీంతో జిల్లాలో మంగళవారం మొత్తం 42 బృందాలు కోళ్లఫారాలను పరిశీలించాయి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 82 కోళ్ల ఫారాల్లో 62 లక్షల లేయర్, బాయిలర్ కోళ్లు ఉన్నాయి. వీటిలో ఎక్కువ సంఖ్యలో కోళ్లు మృతి చెంది నట్టు గుర్తిస్తే ఆయా ఫారాల యాజమాన్యాలు తక్షణం సమాచారం ఇవ్వాలని జిల్లా పశు సంవర్థకశాఖ ఆదేశిం చింది. బర్డ్‌ఫ్లూ నేపథ్యంలో ప్రజల్లోనూ భయాందోళనలు వ్యక్తమవుతుండడంతో ఎక్కడికక్కడ ప్రజల్లో అవగాహన వచ్చేలా చైతన్యం చేయాలని అధికారులు ఆదేశించారు.
కాకినాడ జిల్లాలో అంగన్‌వాడీల గుడ్డుకు ఓకే
కాకినాడ జిల్లాలో స్త్రీశిశు సంక్షేమశాఖ పరిధిలో అంగన్‌వాడీలకు సరఫరా అవుతున్న గుడ్లను చిన్నారులకు తినిపించవచ్చా లేదా అనే దానిపై ఆ శాఖ అధికారులు మంగళవారం విషయాన్ని పశుసంవర్థకశాఖ దృష్టికి తీసుకువెళ్లారు. ఉడికిం చిన గుడ్లను తినడం వల్ల ఎలాంటి వైరస్ ముప్పు ఉండదని స్పష్టం చేయడంతో ఈ జిల్లాలో అంగన్‌వాడీలకు గుడ్ల సరఫరా యథాతథం చేశారు. బర్డ్‌ఫ్లూ ఆందోళనల నేపథ్యంలో మంగళవారం గుడ్డు ధర పతనమైంది.
గుడ్డు.. బ్యాడ్
బర్డ్‌ఫ్లూ ప్రభావం కోళ్ల పెంపకందార్లను కొంత దెబ్బకొట్టింది. ఒకట్రెండు రోజుల్లో ఈ ప్రభావం నుంచి బయటపడతామని కోళ్ల రైతులు ఆశిస్తున్నారు. గుడ్ల పరిశ్రమకు సంబంధించి ఒక్కొక్క గుడ్డు రైతు ధర సోమవారం రూ.4.25 వరకు ఉండగా మంగళవారం రూ.3.95కి తగ్గించి ట్రేడర్లు కొనుగోలు చేశారు. ఒకేరోజు 30 పైసలు పడిపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. కిలో రూ.200 నుంచి రూ.220 వరకు విక్రయాలు సాగిన బాయిలర్‌కు కోడిమాంసం ఒక్కసారిగా రూ.180కి పడిపోయింది. కొన్నిచోట్ల కొనేవారు లేక చికెన్ దుకాణాలు తెరవలేదు.
బడులు.. సెంట్రల్ జైలులో గుడ్డు నిలుపుదల
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): బర్డ్ ఫ్లూ తీవ్రత వల్ల జిల్లాలోని అన్ని స్కూల్స్‌లో గుడ్లు పంపిణీ నిలిపివేశామని డీఈవో వాసుదేవరావు తెలిపారు. పరిస్థితులకు అనుగుణంగా కలె క్టర్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటా మన్నారు. తమ డీజీ ఆదేశాల మేరకు సెం ట్రల్ జైలులోని ఖైదీలకు చికెన్, గుడ్డుతో భోజనం ఆపేశామని కోస్తాంధ్ర ప్రాంత డీఐజీ ఎంఆర్ రవికిరణ్ పేర్కొన్నారు. ఉన్నతాధికారుల తదుపరి ఆదేశాల వరకూ వాటి బదులుగా మెనూ ప్రకారం శాఖాహార భోజనం అందిస్తామన్నారు. బర్డ్ ఫ్లూపై తాము అప్రమత్తంగా ఉన్నా మన్నారు. జైలులో ఖైదీలకు ఆదివారం ఒక్కో ఖైదీకి 175 గ్రాముల చికెన్.. మొత్తం గా ఆదివారం సుమారు 280 కిలోల చికె న్ వినియోగిస్తారు. బర్డ్ ఫ్లూ నేపథ్యంలో అధికారుల ఆదేశాలు వచ్చే వరకూ నిలిపి వేస్తున్నట్టు ప్రకటించారు.
ఎస్సీ హాస్టళ్లలో మటన్ పెట్టండి!
రాజమహేంద్రవరం అర్బన్, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి) :బర్డ్ ఫ్లూ కేసులు నమోదు నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని ఎస్సీ హాస్టళ్లలో చికెన్, గుడ్లు సరఫరా నిలుపుదల చేయాల్సిందిగా జిల్లా సాంఘిక సంక్షేమ అధికారిణి ఎంఎస్ శోభారాణి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు మంగళవారం జిల్లాలోని ఎస్సీ బాలురు, బాలికల హాస్టళ్ల వార్డెన్లతో ఆమె సమావేశమై పరిస్థితులపై చర్చించారు. జిల్లాలోని ప్రి మెట్రిక్ హాస్టళ్లల్లో ప్రస్తుత మెనూ ప్రకారం అమల్లో ఉన్న వారానికి మూడు రోజులు చికెన్, ఆరు రోజులు కోడిగుడ్లు, పోస్టు మెట్రిక్ హాస్టళ్లలో రెండు రోజులు చికెన్, ఆరు రోజులు కోడిగుడ్లు సరఫరా నిలుపుదల చేస్తున్నట్టు వెల్లడించారు. చికెన్, గుడ్లుకు బదులుగా ఉదయం అల్పాహారంలో పాలు, బూస్ట్, ఆదివారం మటన్ కర్రీ పెట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా హాస్టల్స్ వార్డెన్లకు సూచించారు.
2900 కోళ్లను పూడ్చేశారు!
పెరవలి మండలం కానూరు ఆగ్రహారంలో అధికారులు పారిశుధ్య పరి రక్షణ చర్యలు చేపట్టారు.రెడ్ జోన్‌లో భాగంగా మంగళవారం మాస్కులు ధరించి బ్లీచింగ్ చల్లించారు. ఇదిలా ఉండగా కానూరులోని కోళ్లఫారాల్లో మిగిలిన 2900 కోళ్లను స్పెషల్ టీమ్స్ గోతులు తీసి పూడ్చివేయిం చారు.కోళ్ల ఫారం వద్ద ఉన్న 350 గుడ్లను కూడా గోతులు తీసి పాతిపెట్టారు.డీపీవో శాంతమ ణి ఆధ్వర్యంలో గ్రామంలో రెడ్‌జోన్‌లో చేపట్టిన వివిధ శానిటేషన్ చర్యలు పర్యవేక్షించారు.పౌలీ్ట్ర ఏరియాలో సోడియం క్లోరైడ్‌తో క్లీన్ చేసే పనులు నిర్వహించారు. గ్రామంలో 2700 హౌస్‌హోల్డ్స్ ఉండగా వాటన్నింటిని 3 బృందాలు సర్వే చేశాయి.
వండిన చికెన్ మాత్రమే తినాలి
చికెన్ తింటే.. 75 సెంటీగ్రేడ్ ఉష్టోగ్రత వరకూ వండినది మాత్రమే తీసుకోవాలి. పచ్చిమాంసం తినకూడదు. హాఫ్ బాయిల్డ్ గుడ్లు తినకూడదు. కోడ్లు, మాంసం చేతితో తాకిన తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి. గుడ్లు, చికెన్ వేర్వే రుగా ఉంచాలి. ఇతర ఆహార పదార్థాలతో కలపకూడదు. ముడి చికెన్, కోడిగుడ్లు తాకిన ఉపకరణాలను బాగా శుభ్రం చేయాలి. కోళ్లు మరణించి ఉంటే వాటిని జాగ్రత్తగా నిర్మూలన చేయాలి. రవాణా చేసే డబ్బాలు తరచూ శుభ్రం చేయాలి. తూర్పు గోదావరి జిల్లాలో ఎవరికైనా జ్వరం, జలుబు, తలపోటు, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్య సిబ్బందికి చెప్పాలి.
- డాక్టర్ కె.వెంకటేశ్వరరావు, డీఎంహెచ్‌వో, తూర్పుగోదావరి