లే..డౌట్!
ABN , Publish Date - Jan 26 , 2025 | 01:13 AM
లెక్కతేలుస్తాం..అక్రమాల పనిపడతాం అం టూ అధికారులు రంగంలోకి దిగారు.. సుమా రు నెలరోజుల పాటు సర్వే చేసి ఏమీ తేల్చ లేకపోయారు..ఇదీ కోట్లాది రూపాయల విలు వైన స్థలాలున్న రాజమండ్రి పబ్లిక్ సర్వీస్ కో ఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ స్థలాలు (భాస్కర్ నగర్ లేవుట్)లో పరిస్థితి..
గతంలో నెల రోజులు సర్వే
భాస్కర్‌నగర్‌లో 278 ప్లాట్లు
గత సర్వేలో 103 పరిశీలన
155 ప్లాట్లు అన్యాక్రాంతం?
స్వాధీనానికి కలెక్టర్ మొగ్గు
త్వరలో మళ్లీ సర్వేకు ఆదేశం
భూ కుంభకోణంపై దృష్టి
తవ్వేకొద్దీ అక్రమాలు
(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)
లెక్కతేలుస్తాం..అక్రమాల పనిపడతాం అం టూ అధికారులు రంగంలోకి దిగారు.. సుమా రు నెలరోజుల పాటు సర్వే చేసి ఏమీ తేల్చ లేకపోయారు..ఇదీ కోట్లాది రూపాయల విలు వైన స్థలాలున్న రాజమండ్రి పబ్లిక్ సర్వీస్ కో ఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ స్థలాలు (భాస్కర్ నగర్ లేవుట్)లో పరిస్థితి..ఈ లేఅవుట్‌లో మొ త్తం 278 పాట్లు ఉన్నాయి.అధికారులు నెల రో జులు పాటుపడి 103 ప్లాట్లను వెరిఫై చేశారు. సుమారు 155 ప్లాట్లు అన్యాక్రాంతమైనట్టు ప్రాథమిక అంచనా వేసిన సంగతి తెలిసిందే. చట్టప్రకారం అర్హులకు న్యాయం చేయడానికి, రికార్డులు లేనివాటిని స్వాధీనం చేసుకోవడా నికి నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ మేరకు ప్రభుత్వ లాయర్ అభిప్రాయం కోరు తూ కలెక్టర్ లేఖ కూడా రాశారు.
‘ఆంధ్రజ్యోతి’ కథనంతో కదలిక
భాస్కర్‌నగర్ లేఅవుట్‌లో అక్రమాలపై ‘ఆం ధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై కలెక్టర్ ప్రశాంతి స్పందించి అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేశారు. అధికారులతో కమిటీ వేసి వివరాలు సేకరించి తర్వాత మొత్తం సర్వే చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత నెలలో జిల్లా కోఆపరేటివ్, రెవెన్యూ అధికారుల సమక్షంలో మూడు రోజుల పాటు సర్వే చేసి సుమారు 155 ప్లాట్ల వివరాలు తేల్చారు. ఈలోపు సర్వేయర్లకు వేరే పనులు ఉండడంతో సర్వే నిలిచిపోయింది. త్వరలో మరింత మంది సర్వేయర్లను ఏర్పాటు చేసి మొత్తం ప్లాట్ల వివరాలన్నీ సేకరిస్తామని అధికారులు చెబుతున్నారు. కానీ ఇదే వేడిలో పూర్తి చేసి అక్రమాల నిగ్గు తేల్చితే కోట్లాది రూపాయల కుంభకోణం బయటపడుతుంది. రాజకీయనేతలు, రౌడీషీటర్ల అండతోనే అక్ర మాలు పెచ్చుమీరిన సంగతి తెలిసిందే. తా త్సారం జరిగే కొద్దీ అక్రమార్కులు రకరకాల ఎత్తుగడలు వేసే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు. సర్వే పూర్తయితే ఏళ్ల తరబడి ఉన్న సమస్యకు పరిష్కారం లభిస్తోంది.
అయ్యో పాపం అధికారులు
గతం లో అక్రమాలకు పాల్పడిన వారంతా బాగా సంపాదించుకుని పెత్తందార్లుగా మారి పోయారు.వారి ఊబిలో పడిన అధికారులు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు.రెండు ప్లాట్ల విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయకుండా ఇష్టానుసారం వ్యవహరించిన స హకార శాఖపై కోర్టు ధిక్కార ఆదేశాలు రావ డంతో వారంతా దాని నుంచి బయట పడడా నికి తంటాలు పడుతున్నారు.కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికే ఇక్కడి పరిస్థితిపై కమిటీ వేసి ఒక నివేదిక కూడా రప్పించుకున్న తర్వాతే సర్వేకు ఆదేశించారు.ఈ మేరకు వాస్త వంగా అర్హులకు న్యాయం చేయడంతో పాటు రికార్డులులేనివి, అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లి న వాటిన ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి.