హోరాహోరీగా బాస్కెట్‌బాల్ పోటీలు
ABN , Publish Date - Jan 17 , 2025 | 12:35 AM
రామచంద్రపురం (ద్రాక్షారామ), జనవరి 16 (ఆంధ్రజ్యోతి): కోనసీమ జిల్లా రామచంద్రపురం కృత్తివెంటి పేర్రాజుపంతులు క్రీడా ప్రాంగణంలో 14వ ఆలిండియా, 20వ ఆంధ్ర

రామచంద్రపురం (ద్రాక్షారామ), జనవరి 16 (ఆంధ్రజ్యోతి): కోనసీమ జిల్లా రామచంద్రపురం కృత్తివెంటి పేర్రాజుపంతులు క్రీడా ప్రాంగణంలో 14వ ఆలిండియా, 20వ ఆంధ్ర ప్రదేశ్ బాస్కెట్‌బాల్ టోర్నమెంటులో భాగంగా గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్ పోటీల్లో మెన్స్ అండ్ ఉమెన్స్ జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఫ్రీక్వార్టర్స్ నుం చి క్వార్టర్స్ ఫైనల్స్‌వరకు జట్ల మధ్య పోరు ఉత్కంఠ భరితంగా సాగింది. పురుషులు, మహిళ జట్ల మధ్య పోటీలను జరిగాయి.
సెమీస్‌కు చేరిన జట్లు
మహిళల విభాగంలో ఎస్‌ఆర్‌ఎం చెన్నై, పటేల్ అకాడమీ చత్తీస్‌ఘడ్, రామచంద్రపురం, సెంట్రల్ హైదరాబాద్ జట్లు సెమీస్‌కు చేరుకున్నాయి. పురుషుల విభాగంలో క్వార్టర్స్ ఫైనల్ మ్యాచ్‌లో సీఆర్‌పీఎస్ చండీఘర్, బిలాస్‌స్టీల్ చత్తీస్‌ఘడ్ జట్ల మధ్య జరిగిన పోరులో సీఆర్‌పీఎఫ్ చండీఘర్ గెలుపొంది సెమీస్‌కు చేరుకుంది. అదే విధంగా సెంట్రల్ టాక్స్ హైదరాబాద్, వైఎంజీ హైదరాబాద్ జట్ల మధ్య పోరులో సెంట్రల్ టాక్స్ గెలుపొంది సెమీస్‌కు చేరుకుంది. మరో క్వార్టర్స్‌లో రామచంద్రపురం, చిత్తూరు జట్లు, జి.మామిడాడ, డబ్యుఈ హైదరాబాద్ జట్లు తలపడ్డాయి.