బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్ విజేత ఉమ్మడి జిల్లా జట్లు
ABN , Publish Date - Feb 12 , 2025 | 12:47 AM
పిఠాపురం, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా పిఠాపురంలోని పాతబస్టాండు వద్ద గల మున్సిపల్ ఉన్నత పాఠశాల ఆవరణలోని బాస్కెట్‌బాల్ క్రీడా మైదానంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి యూత్ బాస్కెట్‌బాల్ బాలబాలికల చాంపియన్‌షిప్ పోటీల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జట్లు విజేతలుగా నిలిచాయి. 4రోజులుగా జరుగుతున్న ఈ పోటీల్లో భాగంగా మంగళవారం రాత్రి పది గంటల వరకూ జరిగిన ఫైనల్స్ ఉత్కంఠగా సాగాయి. బాలబాలికల విభాగాల ఫైనల్స్

పిఠాపురం, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా పిఠాపురంలోని పాతబస్టాండు వద్ద గల మున్సిపల్ ఉన్నత పాఠశాల ఆవరణలోని బాస్కెట్‌బాల్ క్రీడా మైదానంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి యూత్ బాస్కెట్‌బాల్ బాలబాలికల చాంపియన్‌షిప్ పోటీల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జట్లు విజేతలుగా నిలిచాయి. 4రోజులుగా జరుగుతున్న ఈ పోటీల్లో భాగంగా మంగళవారం రాత్రి పది గంటల వరకూ జరిగిన ఫైనల్స్ ఉత్కంఠగా సాగాయి. బాలబాలికల విభాగాల ఫైనల్స్‌లో ఉమ్మడి తూర్పుగోదావరి, ఉమ్మడి కృష్ణా జిల్లా జట్లు తలపడ్డాయి. రెండు విభాగాల్లోనూ ఉమ్మడి తూర్పు బాలబాలికల జట్లు విజేతలుగా నిలవగా, ఉమ్మడి కృష్ణా జిల్లా జట్లు రెండవ స్థానంలో నిలిచాయి. విజేతలకు పిఠాపురం నియోజకవర్గ జనసేన, బీజేపీ ఇన్‌చార్జిలు మర్రెడ్డి శ్రీనివాసరావు, డాక్టర్ బుర్రా కృష్ణంరాజు, ఉమ్మడి జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గన్నమనేని చక్రవర్తి, బొజ్జా మాణిక్యాలరావు, పిఠాపురం అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ మొగలి కాశీవిశ్వనాథం, జాతీయ ఉమెన్స్ టీం కోచ్ శ్రీని వాసరావు షీల్డులు, బహుమతులు అందజేశారు.