Share News

8 ఆటోలు సీజ్‌

ABN , Publish Date - Feb 18 , 2025 | 01:15 AM

రోడ్డు ప్రమాదాలను నివారించే దిశగా ఎస్పీ బింధుమాధవ్‌ ఆధ్వర్యంలో నిబంధనలు అతిక్రమించిన ఆటోలపై సోమవారం స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి 98 ఆటోలను సీజ్‌ చేసి పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ డ్రైవ్‌ను కాకినాడ ట్రాఫిక్‌- 1, 2 పోలీస్‌స్టేషన్ల సీఐలు ఎన్‌ రమేష్‌, డి.రామారావు ఆధ్వర్యంలో జరిగింది.

8 ఆటోలు సీజ్‌

కాకినాడ క్రైం, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదాలను నివారించే దిశగా ఎస్పీ బింధుమాధవ్‌ ఆధ్వర్యంలో నిబంధనలు అతిక్రమించిన ఆటోలపై సోమవారం స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి 98 ఆటోలను సీజ్‌ చేసి పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ డ్రైవ్‌ను కాకినాడ ట్రాఫిక్‌- 1, 2 పోలీస్‌స్టేషన్ల సీఐలు ఎన్‌ రమేష్‌, డి.రామారావు ఆధ్వర్యంలో జరిగింది. ఓవర్‌లోడ్‌ పాసింజర్స్‌, ఓవర్‌లోడ్‌ స్కూల్‌ చిల్డ్రన్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌లు, ఇన్స్యూరెన్స్‌ లేని ఆటోలు, ర్యాష్‌ డ్రైవింగ్‌, నిర్లక్ష్యంగా నడిపి ప్రమాదాలకు కారణమవుతున్న ఆటోలపై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించా రు. ఈ సందర్భంగా ట్రాఫిక్‌- 2 పోలీస్‌స్టేషన్‌లో అవగాహనా సదస్సుకు హాజరైన ఎస్పీ జి. బింధుమాధవ్‌ ఆటో డ్రైవర్లను ఉద్దేశించి మాట్లాడుతూ డ్రైవర్లు అందరూ ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించాలన్నారు. ఆటోలలో పరిమితికి మించి స్కూల్‌ పిల్లలను, పాసింజర్లను ఎక్కించరాదన్నారు. ఎవరైనా ఆటో డ్రైవర్లు నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. x

Updated Date - Feb 18 , 2025 | 01:15 AM