ఉద్యాన పంటల సాగుపై మక్కువ చూపాలి
ABN , Publish Date - Jan 31 , 2025 | 11:28 PM
రైతులు ఉద్యాన పంటలను పండించేందుకు మక్కువ చూపించాలని కృషి విజ్ఞాన కేంద్ర సంచాలకుడు బి.గోవిందరాజు అన్నారు. పార్వతీపురం విశ్వవిద్యాలయంలో చదువుతున్న 10 మంది విద్యార్థులు శుక్రవారం తెలికిచర్లలో ఏర్పాటు చేసిన రైతు సదస్సు లో ఆయన మాట్లాడుతూ ఉద్యాన పంటల ద్వారా రైతులకు స్థిర ఆదాయం లభిస్తుందని, కూలీల ఖర్చు త గ్గుతుందని, ప్రతికూల వాతావరణంలో సైతం ఆదాయం వస్తుందన్నారు.

నల్లజర్ల, జనవరి 31(ఆంధ్రజ్యోతి): రైతులు ఉద్యాన పంటలను పండించేందుకు మక్కువ చూపించాలని కృషి విజ్ఞాన కేంద్ర సంచాలకుడు బి.గోవిందరాజు అన్నారు. పార్వతీపురం విశ్వవిద్యాలయంలో చదువుతున్న 10 మంది విద్యార్థులు శుక్రవారం తెలికిచర్లలో ఏర్పాటు చేసిన రైతు సదస్సు లో ఆయన మాట్లాడుతూ ఉద్యాన పంటల ద్వారా రైతులకు స్థిర ఆదాయం లభిస్తుందని, కూలీల ఖర్చు త గ్గుతుందని, ప్రతికూల వాతావరణంలో సైతం ఆదాయం వస్తుందన్నారు. ఉద్యాన పం ట వల్ల పచ్చదనం పెరిగి వర్షాలతోపాటు ప్రజలకు చల్లదానం కలిగిస్తాయన్నారు. ప్రభుత్వాలు సైతం ఉద్యాన పంటలకు ప్రోత్సహకాలు ఇస్తోందన్నారు. కార్యక్రమంలో మండల ఉద్యాన అధికారిణి బబిత, టీడీపీ నాయకులు సుంకర సుబ్బారావు, చీమకుర్తి రామకృష్ణ, సర్పంచ్ బండి చిట్టి, డాక్టర్ అరుణకుమారి, పెదబాబు పాల్గొన్నారు.