ఆక్రమణల తొలగింపు వేగవంతం చేయాలి
ABN , Publish Date - Feb 15 , 2025 | 12:55 AM
ఆక్రమణల తొలగింపు పనులు వేగవంతం చేయాలని కమిషనర్ కేతన్ గార్గ్ అన్నారు. శుక్రవారం మఽద్యాహ్నం ఆయన టౌన్ ప్లానింగ్ విభాగాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ సందర్భంగా టౌన్ ప్లానింగ్ కార్యకలాపాలపై సమీక్షించారు. కమిషనర్ మాట్లాడుతూ పట్టణ ప్రణాళిక విభాగం సిబ్బంది నిబద్ధతతో పనిచేసి నగరపాలక సంస్థ ప్రతిష్టను ఇనుమడింపజే యాలన్నారు.

కమిషనర్ కేతన్ గార్గ్
రాజమహేంద్రవరం టౌన్ ప్లానింగ్ విభాగం ఆకస్మిక తనిఖీ
కార్యకలాపాలపై సమీక్ష
రాజమహేంద్రవరం సిటీ, ఫిబ్రవరి 14(ఆంరఽధజ్యోతి): ఆక్రమణల తొలగింపు పనులు వేగవంతం చేయాలని కమిషనర్ కేతన్ గార్గ్ అన్నారు. శుక్రవారం మఽద్యాహ్నం ఆయన టౌన్ ప్లానింగ్ విభాగాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ సందర్భంగా టౌన్ ప్లానింగ్ కార్యకలాపాలపై సమీక్షించారు. కమిషనర్ మాట్లాడుతూ పట్టణ ప్రణాళిక విభాగం సిబ్బంది నిబద్ధతతో పనిచేసి నగరపాలక సంస్థ ప్రతిష్టను ఇనుమడింపజే యాలన్నారు. డీపీఎంఎస్ ద్వారా వచ్చే ప్రతి భవన నిర్మాణ దరఖాస్తును పెండింగ్‌లో ఉంచకుండా నిర్ణీత సమయంలో పరిష్కరించాలని, బీపీఎస్ దరఖాస్తులు పరిశీలించి పరిష్కరించడానికి అవసరమైన అన్ని పత్రాలు జతచేసి దా ఖలు చేయాలన్నారు. లైసెన్స్‌డ్ టెక్నికల్ పర్సన్ (ఎల్‌టీపీ)కి ఫోను చేసి దరఖాస్తుతో పాటు జత చేయుచున్న పత్రాల గురించి ఆరా తీశారు. విస్తరణ చేయాల్సిన రహదారులలో ఉన్న భవన యజమానుల నుంచి పత్రా లను వెంటనే సేకరించాలన్నా రు. అలాగే కొత్తగా చేపట్టబోయే రోడ్డు విస్తరణకు ప్రణాళిక సిద్ధం చేసి సదరు రోడ్డు లోని భవన యజమానులతో సంప్రదింపులు వెంటనే పూర్తి చే యాలని ఆదేశించారు. టీడీ ఆర్ కోసం వచ్చిన దరఖాస్తులను పరిష్కరించే ముందు స్థల యజమాని అంగీకార పత్రం తీసుకొని వారు దాఖలు చేసిన స్థలం దస్తావేజులు, ఇతర పత్రాలు సక్రమంగా సమర్చించేలా చూడాలన్నారు. నగరంలో జం క్షన్ల అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయా లన్నారు. కోటిపల్లి బ స్టాండ్ వద్ద అనుమతిలేకుండా ఏర్పాటు చేసిన కంటైనరును తొలగించాలని టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ (టీపీబీవో)లను ఆదేశించారు. అనుమతిలేకుండా ఏర్పా టు చేసిన బ్యానర్లను తొలగించాలని, వాటిని పెట్టిన వారికి పెద్ద మొత్తంలో జరిమానాలు విధించాలని ఆదేశించారు. అనంతరం ఏపీటౌన్ ప్లానింగ్ శాఖ సిబ్బంది డైరీని కమిషనర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో సిటీ ప్లానర్ కోటయ్య, డిప్యూటీ సిటీ ప్లానర్ సత్యనారాయణ రాజు, అసిస్టెంట్ సిటీ ప్లానర్ అనితా జూలీ, శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు.
రుణాలు సక్రమంగా వినియోగించుకోవాలి
ప్రభుత్వం మహిళల అభివృద్ధి కోసం మం జూరు చేస్తున్న రుణాలను సక్రమంగా వినియోగించుకోవాలని కమిషనర్ కేతన్‌గార్గ్ సూచించారు. శుక్రవారం సాయంత్రం కోర్లంపేట హనుమాన్ మహిళా స్వయం సహాయక సంఘం సభ్యులు నిర్వహించుకున్న సమావేశానికి ఆయ న విచ్చేసి వారి కార్యకలాపాలను పరిశీలించి పలు సూచనలు చేశారు.. సమావేశంలో మెప్మా సిటీ మిషన్ మేనేజరు రామలక్ష్మి, కమ్యూనిటి ఆర్గనైజర్లు వరలక్ష్మి, రాజ్యలక్ష్మి, హానుమాన్ మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు.