Share News

ఆకట్టుకున్న దేవిన సిస్టర్స్‌ సైకతశిల్పం

ABN , Publish Date - Jan 12 , 2025 | 12:59 AM

రంగంపేట, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 12న స్వామి వివేకానంద జయంతి, జాతీయ యువజన దినోత్సవం, సంక్రాంతిని పురస్కరించుకుని సంస్కృతి, సంప్రదా

ఆకట్టుకున్న దేవిన సిస్టర్స్‌ సైకతశిల్పం
రంగంపేటలో సేవ్‌ కల్చర్‌ అనే నినాదంతో దేవిన సిస్టర్స్‌ రూపొందించిన సైకతశిల్పం

రంగంపేట, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 12న స్వామి వివేకానంద జయంతి, జాతీయ యువజన దినోత్సవం, సంక్రాంతిని పురస్కరించుకుని సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని (సేవ్‌ కల్చర్‌) అనే నినాదంతో తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో ప్రముఖ సైకతశిల్ప దేవిన శ్రీనివాస్‌ కుమార్తెలు దేవిన సోహిత, దేవిన ధన్యత శనివారం సైకతశిల్పం రూపొందించారు. 14 అడుగుల వెడల్పు, 6 అడుగుల ఎత్తు కలిగిన ఈ సైకత శిల్పాన్ని ఇద్దరూ 8 గంటలు శ్రమించి తీర్చిదిద్దారు. ఈ శిల్పంలో ఒక వైపు స్వామి వివేకానంద, మరో వైపు సంక్రాంతి వాతావరణాన్ని చూపించారు. ఈ సందర్భంగా దేవిన సిస్టర్స్‌ను పలువురు ప్రజాప్రతినిధులు, అఽధికారులు అభినందించారు.

Updated Date - Jan 12 , 2025 | 12:59 AM