ధర..గెలవలేక!
ABN , Publish Date - Feb 07 , 2025 | 12:45 AM
అరటి రైతు వెన్ను విరి గింది. గెలలు కొనేనాథుడు లేక.. కొన్నా గిట్టుబాట కాకపోవడంతో లబోదిబోమం టు న్నారు. ఈ ఏడాది అరటి ధరలు అంతంతమాత్రం గానే ఉన్నాయి.

దేవరపల్లి, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): అరటి రైతు వెన్ను విరి గింది. గెలలు కొనేనాథుడు లేక.. కొన్నా గిట్టుబాట కాకపోవడంతో లబోదిబోమం టు న్నారు. ఈ ఏడాది అరటి ధరలు అంతంతమాత్రం గానే ఉన్నాయి. కలిసిరాకపోతుందా అని రైతులు సాగుకు ఉపక్రమించారు. అయినా లాభాల్లేవ్.. రైతులను నష్టాల బాట పట్టించాయి. జిల్లా వ్యాప్తంగా కొవ్వూరు, ఉండ్రాజవరం, దేవరపల్లి, పెర వలి, గోపాలపురం, కడియం, అనపర్తి, రంగంపేట తదితర మండలాల్లో అరటి సాగు ఎక్కువగా చేస్తా రు.కొవ్వూరులో చక్రకేళీ అరటిని ఎక్కువగా సాగు చేస్తారు. పెరవలి, ఉండ్రాజవరం మండలాల్లో కర్పూర, కూర అరటిగెలలు ఎక్కువగా సాగు చేస్తారు. గతంలో ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రమే అరటి సాగు ఉండేది. ఇప్పుడు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోనూ విపరీతంగా అరటి సాగు పెరిగింది. దీంతో ధరలు నేలచూపులు చూస్తున్నాయి. ఉత్ప త్తికి తగిన డిమాండ్ లేకపోవడంతో ధరలు పెరగడంలేదు. మరో వైపు జిల్లాలోనూ రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు చూడడం లేదు. దీంతో ధర పెరిగే సూచనలు కనిపించడంలేదు. గతంలో ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రమే అరటి సాగు ఉండడంతో లాభాల పంటగా ఉండేది. నేడు ఎక్కడ పడితే అక్కడ సాగు చేస్తుండడంతో అరటి సాగు చేస్తున్న రైతులు నష్టాల బాటపడుతు న్నారు. గతంలో తూర్పుగోదావరి జిల్లా నుంచి అరటి గెలలను ఒడిసా, పశ్చిమ బెంగాల్,తెలంగాణ తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేసేవారు. నేడు ఎగుమతులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. దీంతో గత కొన్నేళ్లుగా అరటిరైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఈ ఏడాది అంతే.ధరలేక పోవడంతో కర్పూరం గెలలను రైతులు పొలా ల్లోనే చెట్టుకు వదిలే స్తున్నారు.మరో వైపు కూర అరటి గెలలు కొనే నాధుడే కనిపించడంలేదుని వా పోతున్నారు.గతంలో కూర అరటి గెల రూ.200 - రూ.250 వరకు ధర పలికేది.. గత నవం బర్ నుంచి అరటి రూ.30 - రూ.80 మాత్రమే పలకడంతో రైతులకు కనీసం రవాణా ఛార్జీలు కూడా రాని పరిస్థితి.అయితే బయట మార్కెట్‌లో మాత్రం అరటి కా యల ధరలు దిగిరాలేదు.3 కాయ లు రూ.20ల చొప్పున విక్రయించడం గమనార్హం. చక్రకేళి అరటి గెలల పరిస్థితి అలాగే ఉంది. సైకిల్ గెలలు తీసుకెళ్తుంటే రూ.500 నుంచి రూ.600 వరకూ ధర పలుకుతుందని రైతులు వాపోతు న్నారు.ఎకరం అరటితోట సాగుచేయాలంటే రూ.లక్ష వరకు ఖర్చు పెట్టాల్సిందే. గెలలు కోసి మార్కెట్‌కు తరలిస్తుంటే కూలి, రవాణా ఖర్చులు కూడా రావడంలేదని రైతులు వాపోతున్నారు.
కూర గెల రూ.40
మూడెకరాల్లో కూర అరటి సాగు చేస్తు న్నా. గెల మార్కెట్‌కు తరలిస్తుంటే రూ.40 - రూ.50ధర పలుకుతుంది. దీని వల్ల రవాణా, కూలీ ఛార్జీలు రాని పరిస్థితి. ధర లేక అరటి రైతులు దెబ్బ తింటున్నారు.
- ఎం.వెంకటేశ్వరరావు, అరటి రైతు, కురుకూరు