Share News

పేపరుమిల్లు కార్మికులకు న్యాయం చేస్తాం

ABN , Publish Date - Jan 06 , 2025 | 12:18 AM

పేపరుమిల్లు కార్మికులకు న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు రాష్ట్ర పరిశ్రమల ముఖ్యకార్యదర్శి కార్తికేయ మిశ్రాకు ఆదే శాలు ఇచ్చారని రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ తెలిపారు.

పేపరుమిల్లు కార్మికులకు న్యాయం చేస్తాం
ఏపీ పేపరుమిల్లు కార్మికుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, ఇతర ఎమ్మెల్యేలు

కార్మికులతో ఎమ్మెల్యేల చర్చలు

రాజమహేంద్రవరం సిటీ, జనవరి 5 (ఆం ధ్రజ్యోతి): పేపరుమిల్లు కార్మికులకు న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు రాష్ట్ర పరిశ్రమల ముఖ్యకార్యదర్శి కార్తికేయ మిశ్రాకు ఆదే శాలు ఇచ్చారని రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ తెలిపారు. రాజమహేంద్రవరం ఆంధ్రా పేపరుమిల్లులో సమ్మెకు దిగిన కార్మికులతో ఆదివారం ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, బత్తుల బలరామకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ, జనసేన నగర ఇన్‌చార్జి అనుశ్రీ సత్యనారాయణ సమావేశమయ్యారు. గత ఐదేళ్లుగా వైసీపీ ప్రజాప్రతినిఽధులు మిల్లు యాజమాన్యంతో కుమ్మక్కయి సూట్‌ కేసులు అందుకుని కార్మికులను రోడ్డున పడేశారని విమర్శించారు. అందుకే కార్మికులంతా ఎన్నికల్లో వైసీపీకి తగిన బుద్ధి చెప్పారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆరునెలలుగా పరిస్థితిని అర్ధం చేసుకుంటున్నామన్నారు. సమస్యను ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి సమక్షంలో సీఎం చం ద్రబాబు దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. స్పం దించిన సీఎం కార్మికులకు మంచి ఒప్పందం చేయాలని అధికారులను ఆదేశించారని చెప్పా రు. ఇలాంటి సమయంలో కార్మికులు ఇంకా ఆందోళనకు కూర్చుంటే ప్రతిపక్షనాయకులు, కొందరు కార్మిక నాయకులు వారి స్వార్థం కోసం మిమ్మల్ని తప్పుదోవ పట్టించే అవకాశం ఉందన్నారు. వారికి ఆ అవకాశం ఇవ్వొద్దని సూచించారు. కూటమి ప్రభుత్వం పేపరుమిల్లు కార్మికులకు న్యాయం చేస్తుందన్నారు. కార్మికులకు మంచి అగ్రిమెంట్‌ అందించేందు కు సీఎం చంద్రబాబు పరిశ్రమల అధికారులకు ఆదేశాలు ఇచ్చారని..ఆందోళన చెందవద్దని చెప్పారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కాశి నవీన్‌ కుమార్‌, నక్కా చిట్టిబాబు,వర్రే శ్రీనివాసరావు, రెడ్డి మణేశ్వరరావు, బుడ్డిగ రాధ, బుడ్డిగ రవి,దినేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 06 , 2025 | 12:18 AM