ఏపీ పేపరుమిల్లు లాకౌట్...ఎత్తివేత
ABN , Publish Date - Jan 07 , 2025 | 12:53 AM
రాజమహేంద్రవరం సిటీ, జనవరి 6 (ఆం ధ్రజ్యోతి): నగరంలోని ఆంధ్రప్రదేశ్ పేపరు మిల్లును మూసి వేశారు. నూతన వేతన ఒప్ప ందం చేయాలని ఆంధ్రప్రదేశ్ పేపరు మిల్లు కార్మికులు చేపట్టిన సమ్మెతో మిల్లు యాజమా న్యం లాకౌట్ ప్రకటించింది. మిల్లు కార్మికులు గత కొద్ది నెలలుగా నూతన వేతన ఒప్పందం కోసం నిరసనలు చేపట్టిన సంగతి విధితమే. ఇదిలా ఉండగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రెండు దపాలుగా యాజమాన్య ప్రతినిధులు, కార్మిక యూని

వేతనం పెంచాలని కార్మికుల డిమాండ్
గత ఐదు రోజులుగా సమ్మె
సోమవారం లాకౌట్ ప్రకటన
రోడ్డెక్కిన 2 వేల మంది కార్మికులు
ఫ్యాక్టరీ ఎదుట ఉద్రిక్తత
లాకౌట్ ఎత్తివేయాలని
కార్మికసంఘాల డిమాండ్
దిగివచ్చిన యాజమాన్యం
లాకౌట్ ఎత్తివేత ప్రకటన
రాజమహేంద్రవరం సిటీ, జనవరి 6 (ఆం ధ్రజ్యోతి): నగరంలోని ఆంధ్రప్రదేశ్ పేపరు మిల్లును మూసి వేశారు. నూతన వేతన ఒప్ప ందం చేయాలని ఆంధ్రప్రదేశ్ పేపరు మిల్లు కార్మికులు చేపట్టిన సమ్మెతో మిల్లు యాజమా న్యం లాకౌట్ ప్రకటించింది. మిల్లు కార్మికులు గత కొద్ది నెలలుగా నూతన వేతన ఒప్పందం కోసం నిరసనలు చేపట్టిన సంగతి విధితమే. ఇదిలా ఉండగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రెండు దపాలుగా యాజమాన్య ప్రతినిధులు, కార్మిక యూనియన్లతో ప్రజాప్రతినిధులు, కలెక్టర్ ప్రశాంతి సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో కార్మికుల డిమాండ్‌ను యాజమాన్యం అంగీకరించలేదు. మిల్లులో రెగ్యులర్ కార్మికులు సుమారు 800మంది, కాంట్రాక్టు కార్మికులు 2 వేల మంది పనిచేస్తున్నారు. నూతనంగా కార్మికుడికి రూ.10,500లు పెంచుతూ వేతన ఒప్పందం చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. మిల్లు యాజమాన్యం రూ.3500 పెంచుతామని తెలియజేసింది. దీనికి కార్మికులు నిరాకరించారు. మిల్లు రూ.1200 కోట్ల లాభాల్లో ఉండగా కార్మికుల వేతనాలు పెంచడంపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని కార్మిక సంఘాలు మండిపడ్డాయి. ఈ మేరకు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, మంత్రి దుర్గేష్, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, బత్తుల బలరామకృష్ణ సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు అమరావతిలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శితో సమావేశం నిర్వహించి కార్మికులకు న్యాయం చేయాలని, అం దుకు ఒక కమిటీని వేయాలని ఆదేశించడం జరిగింది. ఈ మేరకు మిల్లులో గత ఐదు రోజు లుగా సమ్మెలో ఉన్న కార్మికులకు ఆదివారం ప్ర జాప్రతినిధులు మద్దతు ప్రకటించి విషయాన్ని తెలిపారు. గత కొద్ది నెలలుగా చేస్తున్న ఆందో ళన కార్మికులు విరమించాలని.. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పివెళ్లా రు. అయినా కార్మికులు దిగిరాలేదు. దీంతో యా జమాన్య మొండి వైఖరి ప్రదర్శించింది. తెలా ్లరేసరికి అనుహ్యంగా పేపరుమిల్లు యాజమా న్యం మెయిన్ గేటుకు లాకౌట్ నోటీసులను అం టించి మిల్లును క్లోజ్ చేసింది. దీనిపై విస్మయం చెందిన కార్మికులు సోమవారం ఉదయం 6 గంటల నుంచే మిల్లు వద్ద ఆందోళనకు దిగారు. అగ్రిమెంట్ చేయమంటే దానిని చేయకుండా లాకౌట్ ప్రకటించిన యాజమాన్య వైఖరిని కార్మిక సంఘాలు తీవ్రంగా ఖండించాయి. కార్మికులంతా రోడ్డెక్కడంతో పేపరుమిల్లు -సీతం పేట రోడ్డు కార్మికులతో బ్లాక్ అయ్యింది. సంఘట నా స్థలానికి భారీగా పోలీసులు చేరుకున్నారు. కార్మికుల ఆందోళన కొనసాగుతుంది. పేపరుమిల్లు కార్మికులకు అండగా కార్మిక సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు నిలిచారు. కార్మికుల ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. కార్మికులకు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శ్రిఘాకోళ్ళ శిరామసుబ్రహ్మణ్యం, సీఐటీయూ, ఏఐటీ యూసీ నేతలు అరుణ్, కె.రాంబాబు మద్దతు తెలిపారు.
‘‘పేపరుమిల్లు యాజమాన్యం దిగిరాకపోతే సహించేదిలేదు. 2రోజుల్లో యాజమాన్యం నుంచి సానుకూల ప్రకటన రాకపోతే ఉద్య మా న్ని ఉధృతం చేస్తాం’’ అని రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా హెచ్చరించారు.
కూటమి ఎమ్మెల్యేల చొరవతో సమ్మె విరమించిన 9 యూనియన్లు
లాకౌట్ ఎత్తివేసేందుకు అంగీకరించిన పేపరుమిల్లు యాజమాన్యం
ఆంధ్రప్రదేశ్ పేపరుమిల్లు కార్మికులు వేతన ఒప్పందం కోసం చేపట్టిన సమ్మెను 9 యూనియన్లు విరమించుకున్నాయి. కూటమి ఎమ్మె ల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణల చొరవతో సోమవారం రాత్రి పరిశ్రమల శాఖ అధికారులను తీసుకుని కార్మిక సంఘాలు, మిల్లు యాజమాన్య ప్రతినిధులతో సుమారు గంటపాటు చర్చించారు. దీంతో 9 యూనియన్లు సమ్మెను విరమించేందుకు అంగీకారం తెలిపాయి. వెంటనే మిల్లు యాజమాన్యం కూడా లాకౌట్‌ను ఎత్తివేసేందుకు అంగీకరించింది. దీంతో పేపరుమిల్లు కార్మికులు మంగళవారం ఉదయం నుంచి విధులకు హజరుకాబోతున్నారు. అయితే మొత్తం 11 యూ నియ్లకు 9 యూనియన్లు సమ్మెను విరమించేందుకు అంగీ కరించగా రెండు యూనియన్లు వ్యతిరేకించా యి. అయితే మిగిలిన ఆ రెండు యూనియన్ల వైఖరి మంగళవారం స్పష్టం కానుంది.