అంతర్వేది కల్యాణోత్సవాలను వచ్చే ఏడాది రాష్ట్ర పండుగగా నిర్వహిస్తాం
ABN , Publish Date - Feb 24 , 2025 | 01:38 AM
అంతర్వేది, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాలను ప్రతి ఇంటా పండుగలా చేసుకునేందుకు 2026లో రాష్ట్ర పండుగలా నిర్వహిస్తామని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అన్నారు. కల్యాణోత్సవ మండప ప్రదేశంలో ఆదివారం నిర్వహించిన అభినందన, సత్కార సభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు.

రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్
అంతర్వేది, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాలను ప్రతి ఇంటా పండుగలా చేసుకునేందుకు 2026లో రాష్ట్ర పండుగలా నిర్వహిస్తామని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అన్నారు. కల్యాణోత్సవ మండప ప్రదేశంలో ఆదివారం నిర్వహించిన అభినందన, సత్కార సభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 22 శాఖల సమన్వయంతో ఉత్సవాల నిర్వహణ అద్భుతంగా జరిగిందన్నారు. కలెక్టర్, ఎస్పీ, దేవదాయ శాఖ, ఉత్సవ సేవా కమిటీ సంయుక్త నిర్వహణలో లక్షలాది మంది భక్తులు స్వామివారి కల్యాణాన్ని తిలకించి దర్శించుకుని వెళ్లారన్నారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయాన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామని తెలిపారు. భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా చూశామన్నారు. పారిశుధ్యం, తాగునీరు, రవాణా, బందోబస్తు, అన్నసత్రాల నిర్వహణ, వైద్య, ఇతర శాఖల పనితీరు గతంలో కంటే మెరుగ్గా ఉందన్నారు. భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో కల్యాణోత్సవాలను రాష్ట్ర పండుగలా నిర్వహించేందుకు కలసికట్టుగా కృషి చేద్దామన్నారు. ఉత్సవాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. ఆలయ సహాయ కమిషనరు వి.సత్యనారాయణ, ఉత్సవ సేవా కమిటీ చైర్మన్ దిరిశాల బాలాజీ, గోదావరి డెల్టా ప్రాజెక్టు చైర్మన్ గుబ్బల శ్రీనివాస్, ముప్పర్తి నాని, గుబ్బల ఫణికుమార్, రాపాక రమేష్‌బాబు, తాడి మోహన్‌బాబు, ఆకన బాబ్జీనాయుడు, పోతురాజు సురేష్, ఎంపీపీ వీరా మల్లిబాబు, ఎంపీటీసీ బైరా నాగరాజు, కూటమి శ్రేణులు, ఉత్సవ సేవా కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు, భక్తులు పాల్గొన్నారు.