Share News

అభివృద్ధి పనులకు ఆమోదం

ABN , Publish Date - Mar 08 , 2025 | 12:28 AM

అన్నవరం, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధిలో వివిధ అభివృద్ధి పనులకు శుక్రవారం దేవస్థానం చైర్మన్‌ ఐవీ రోహిత్‌ ఆమోదం తెలిపారు. శుక్ర వారం జరిగిన ట్రస్టు బోర్టు సమా వేశంలో ఈవో సుబ్బారావు, అన్ని విభాగాల ఏఈవోలు, సూపరెంటెండెంట్‌లు పాల్గొని 43 అజెండాలు ప్రవేశపెట్టారు. వాటిలో ప్రధానంగా రూ.39.75 లక్షలతో ప్రకాష్‌సదన్‌, రూ.39.95 లక్షలతో న్యూసీసీ కాటేజీ, రూ.40లక్షల వ్య

అభివృద్ధి పనులకు ఆమోదం

అన్నవరం దేవస్థానం ట్రస్టు బోర్టు సమావేశం

43 అజెండాలు ప్రవేశపెట్టిన అధికారులు

పాత, కొత్త సీసీ కాటేజీ, ప్రకాష్‌సదన్‌

నందు సుమారు రూ.కోటితో మరమ్మతులు

70శాతం కేంద్రనిధులు,

30శాతం దేవస్థానం నిధులతో కొండ దిగువున పనులు

సత్యదేవుడి వార్షిక కల్యాణ నిర్వహణకు ఆమోదం

అన్నవరం, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధిలో వివిధ అభివృద్ధి పనులకు శుక్రవారం దేవస్థానం చైర్మన్‌ ఐవీ రోహిత్‌ ఆమోదం తెలిపారు. శుక్ర వారం జరిగిన ట్రస్టు బోర్టు సమా వేశంలో ఈవో సుబ్బారావు, అన్ని విభాగాల ఏఈవోలు, సూపరెంటెండెంట్‌లు పాల్గొని 43 అజెండాలు ప్రవేశపెట్టారు. వాటిలో ప్రధానంగా రూ.39.75 లక్షలతో ప్రకాష్‌సదన్‌, రూ.39.95 లక్షలతో న్యూసీసీ కాటేజీ, రూ.40లక్షల వ్యయంతో పాతసెంటినరీ కాటేజీలో మరమ్మతులు, లీకేజీలు అరికట్టడానికి రూపొందించిన అంచనా వ్యయాన్ని ఆమోదించి దేవదాయ కమిషనర్‌కు నివేదించాలని ఆమోదించారు. సత్యదేవుడి వార్షిక కల్యాణానికి రూ.27 లక్షలతో విద్యుద్దీప అలంకరణలు, లైవ్‌టెలికాస్టు, క్లాత్‌డెకరేషన్‌, తదితర పనులుకు ఆమో దం లభించింది. కొండదిగువున భక్తుల సౌకర్యార్థం 70శాతం కేంద్రప్రభుత్వ నిధులు, 30 శాతం దేవస్థానం నిధులతో టాయిలెట్స్‌ నిర్మాణం, కమ్యూనిటీ శా నిటరీ కాంప్లెక్స్‌ నిర్మాణాలకు ఆమోదించి దేవదాయ కమిషనర్‌కు నివేదించాలని సూచించారు. వ్రత పురోహితులకు ప్రస్తుతం టిక్కెట్ల ధరపై ఇస్తున్న రెమ్యునరేషన్‌లో జీతాలు పోను ఏరియర్స్‌ రూపంలో ఇచ్చే మొత్తాన్ని 50 శాతం నుంచి 60శాతానికి పెంపు, కార్పస్‌ ఫండ్‌ను 50నుంచి 40శాతానికి తగ్గించి పురోహితుల వేతనాన్ని వార్షికపెంపు రూ.1000 నుంచి రూ.2000, పింఛన్‌ను రూ.500 నుంచి రూ.1000కి పెంచాలనే అభ్యర్థనను ఆమోదించి దేవదాయ కమిషనర్‌ ఆదేశాలతో అమలుచేయాలని పేర్కొన్నారు. స్వామివారి ప్రసాదానికి వినియోగించే ఆవు నెయ్యి కిలో రూ.590కి విజయాడైరీ, సంఘం డైరీలు లోయెస్ట్‌ టెండర్‌ కోడ్‌ చేయగా వాటిని ఆమోదించారు. ఎండ వల్ల రత్నగిరిపై భక్తుల కాళ్లు కాలకుండా ఉండేందుకు రూ.3.65 లక్షలతో కూల్‌పేయింట్‌ వేయడానికి, రూ.22 లక్షలతో సత్యదేవుడి వార్షిక కల్యాణ నిర్వహణ, రూ.10 లక్షలతో రథశాల వద్ద పనులు, రూ.11.26 లక్షలతో కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి కల్యాణా లకు వ్యయం, రూ.9లక్షలతో కేశఖండనశాల వ ద్ద టాయిలెట్ల నిర్మాణం, రూ.3.75 లక్షలతో దేవస్థానం ఆసుపత్రికి రంగులు, బలిఘట్టం సత్యదేవుడి ఆలయంలో అవసరమైన సిబ్బంది నియామకం తదితర పనులకు ఆమోదం లభించింది.

Updated Date - Mar 08 , 2025 | 12:28 AM