అక్షర కదలిక
ABN , Publish Date - Jan 31 , 2025 | 12:25 AM
అక్షరం కదిలించింది..అందరినీ మేల్కొలిపింది.. సమస్యలపై సమర శంఖం పూరించింది.. పరిష్కారం దిశగా అడుగులు వేస్తోంది.. నాలుగు రోజుల కిందటి వరకూ ఆ కాలనీలో ఏ రోడ్డు చూసినా అధ్వానమే.. మరి నేడు ప్రతి రోజూ పారి శుధ్య చర్యలు చేపడుతున్నారు.. క్లీన్ అండ్ గ్రీన్‌గా తీర్చి దిద్దుతున్నారు.

రాజమహేంద్రవరం సిటీ, జనవరి 30 (ఆంధ్రజ్యోతి) : అక్షరం కదిలించింది..అందరినీ మేల్కొలిపింది.. సమస్యలపై సమర శంఖం పూరించింది.. పరిష్కారం దిశగా అడుగులు వేస్తోంది.. నాలుగు రోజుల కిందటి వరకూ ఆ కాలనీలో ఏ రోడ్డు చూసినా అధ్వానమే.. మరి నేడు ప్రతి రోజూ పారి శుధ్య చర్యలు చేపడుతున్నారు.. క్లీన్ అండ్ గ్రీన్‌గా తీర్చి దిద్దుతున్నారు. రాజమహేంద్రవరం 9వ డివిజన్ వెంకటేశ్వనగర్‌లో మంగళవారం ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో అక్షరం అండగా.. సమస్యల పరిష్కారమే అజెండాగా నినాదంతో నిర్వహించిన సభలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా ప్రజాప్రతినిధి, అధికారుల దృష్టికి తీసుకెళ్లిన సంగతి విధితమే. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే ఆది రెడ్డి శ్రీనివాస్ హామీ ఇచ్చినట్టుగానే ఆ ప్రాంతంలో అధికారుల చర్యలు వేగంగా సాగుతున్నాయి. గురువారం కూడా నగరపాలక సంస్థ ఎస్‌ఈ ఐ.పాండురంగారావు,ఈఈ రీటా, ఇంజనీరింగ్ అధికారుల బృందం,మాజీ కార్పొరేటర్ కోసూరి చండీప్రియ, పార్కు కమిటీ, స్ధానిక పెద్దలు కలిపి వెంకటేశ్వనగర్‌లో పర్యటించారు. టీషేప్ రహదారిని పరిశీలించారు.ఈ రోడ్డులో సగానికి గతంలో ప్రతిపాదన ఉంది మిగిలిన సగానికి కూడా ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నట్టు ఎస్‌ఈ చెప్పారు.అదే రోడ్డులో డ్రైనేజీ సమస్యలపై పరిశీలన చేశారు. వెంకటేశ్వనగర్, విద్యుత్ కాలనీ, బర్మాకాలనీ ప్రాంతాల్లో డ్రైనేజీలను పారిశుధ్య కార్మికులు శుభ్రం చేశారు. రహదారుల పక్కల చెత్త కుప్పలను తొలగించారు. అధికారులు డివిజన్‌లో సమస్యలపై దృష్టికేంద్రీకరించి పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నారు. ఎస్‌బీఐ కాలనీ వాకర్స్ రోడ్డు 4వ వీధిలో గత ప్రభుత్వంలో నిర్మించిన డ్రైనేజీ అసంపూర్తిగా ఉం ది.దీంతో అపార్టుమెంట్ వాసులు ఇబ్బందులు పడుతున్నారు.ఈ విషయాన్ని సమావేశంలో చెప్పడంతో ఎస్‌ఈ పరిశీలించారు.కల్వర్టు రహదారి కంటేఎత్తుగా ఉండి ప్రమాదాలు జరుగుతున్నాయి.