క్యూటమి!
ABN , Publish Date - Mar 08 , 2025 | 01:22 AM
నామినేటెడ్ పదవుల వైపు లోకల్ నాయ కులు ఆశగా చూస్తున్నారు..సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటనతో కూటమి నాయకులం తా క్యూకడుతున్నారు.
త్వరలోనే పాలకవర్గాలు
జిల్లాలో ఆరు ఏఎంసీలు
సమస్యలతో సతమతం
64 మందికి 24 మంది సిబ్బంది
అవుట్ సోర్సింగ్ 64 మంది
అనపర్తి నుంచే ఆదాయం ఫుల్
నిడదవోలుకు అతి తక్కువ
జిల్లాలో 3 రైతు బజార్లు మూత
(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)
నామినేటెడ్ పదవుల వైపు లోకల్ నాయ కులు ఆశగా చూస్తున్నారు..సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటనతో కూటమి నాయకులం తా క్యూకడుతున్నారు.జిల్లా మార్కెట్ కమిటీ పాలకవర్గాల్లో స్థానం సంపాదించడానికి ప్ర యత్నాలు ఆరంభించారు. త్వరలో ఏఎంసీ పాలకవర్గాలను నియమిస్తామని,అభ్యర్థుల పేర్లను ప్రతిపాదించాలని ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు ఇటీవల స్వయంగా సూచించిన సంగతి తెలిసిందే.దీంతో కూటమి శ్రేణులో సం దడి మొదలైంది.జిల్లాలో ఆరు మార్కెట్ యా ర్డులకు ఆరు కమిటీలు నియమించాల్సి ఉంది.
తూర్పున ఆరు ఏఎంసీలు..
జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఉండగా.. ఆరు మార్కెట్ కమిటీలు ఉన్నాయి. రాజ మ హేంద్రవరం సిటీ, రూరల్ నియోజకవర్గాలకు ఒకటే ఉంది. అనపర్తి,రాజానగరం, కొవ్వూ రు, నిడదవోలు,గోపాలపురం నియోజవర్గాల పరిధి లో ప్రత్యేకంగా ఒక్కో కమిటీ ఉంది. అంటే జిల్లాలో ఆరుగురు మార్కెట్ కమిటీ చైర్మన్లు రాబోతున్నారు.వారితో పాటు డైరెక్టర్లను ఎన్ను కుని పాలకవర్గాలను ఏర్పాటు చేస్తారు. ఆరిం టిలో కూటమి ఎలా పంచుకుంటుందో చూ డాలి.సాధారణంగా టీడీపీకే ఎక్కువ ఉంటా యి.తర్వాత జనసేన, మూడో స్థానం బీజేపీకి ఉంటుంది. ఈ పదవుల కేటాయింపు ఎలా అనేదానిపై తర్జనభర్జనలు సాగుతున్నాయి
సమస్యలు తీర్చే వారేరి..
మార్కెట్ కమిటీలు చాలా కాలంగా లేక పోవడంతో జిల్లాలోని ఏఎంసీలు సమస్యలతో సతమతమవుతున్నాయి.మార్కెట్ కమిటీలు రైతులకు తోడ్పాటుగా ఉంటాయి. అయితే ప్రస్తుతం పాలకవర్గాలు లేక ఇబ్బందికరంగా మారింది.జిల్లాలో 12 చెక్ పోస్టుల ద్వారా సెస్ వసూలు చేస్తారు. ఆరు ఏఎంసీల పరిధిలో మొత్తం 128 మంది ఉద్యోగులు అవసరం. వీరిలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు 64 మంది ఉంటారు. కానీ ప్రస్తుతం శాశ్వత ఉద్యోగులు కేవలం 24 మంది,అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు మాత్రం 64 మంది ఉన్నారు. జిల్లాలో 11 రైతు బజార్లు ఉండగా 8 మాత్రమే పనిచేస్తు న్నా యి. ఇక మొబైల్ రైతు బజారు ఉంది. అది నెలకోసారి ఓ రైతు బజారుకు మాత్రమే వెళు తుంది.దానిని మూలన పడేశారు. ఇటీవల సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పేపరుమిల్లు ఎదురుగా ఆర్‌అండ్‌బీ వాంబే గృహాల సమీ పంలో ఒక రైతు బజారుకు ప్రతిపాదించారు. కడియంలో ఒకటి, ధవళేశ్వరంలో మరొకటి నిర్మించనున్నారు.ఇవి గతంలోనే మంజూరైన ప్పటికీ వైసీపీ నిర్లక్ష్యం వల్ల ఆగిపోయాయి. రైతు బజార్ల నిర్మాణాలు పునాదుల్లోనే ఉన్నా యి.ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి వీటిపై దృష్టిపెట్టారు. త్వరలో వీటిని నిర్మించనున్నారు.
అనపర్తికి ఎక్కువ ఆదాయం
జిల్లా మార్కెట్ యార్డుల్లో అనపర్తికి ఎక్కు వ ఆదాయం వస్తోంది. నిడదవోలుకు తక్కువ ఆదాయం వస్తోంది. 2024-25కి అనపర్తిలో రూ.13.47 కోట్ల వసూలు లక్ష్యం కాగా ఇప్పటికే 12.5 కోట్లు వసూలు చేశారు.రాజమండ్రిలో రూ.4.21 కోట్లు లక్ష్యం కాగా 1.74 కోట్లు మా త్రమే వసూలు చేశారు. కొవ్వూరులో రూ.5.05 కోట్లు లక్ష్యం కాగా రూ.1.85 కోట్లు మాత్రమే వసూలు చేశారు.గోపాలపురంలో రూ.3.47 కోట్లు లక్ష్యం కాగా వసూళ్లు రూ.1.82 కోట్లు. నిడద వోలులో రూ.1.5 కోట్లు లక్ష్యం కాగా రూ.1.62 కోట్లు వసూలు చేశారు. రాజానగ రంలో రూ.3.13 కోట్లు లక్ష్యం కాగా రూ.1.86 కోట్లు వసూలు చేశారు.మార్చి 31వ తేదీనాటికి మొత్తం వసూళ్లు పూర్తి కావలసి ఉందని జిల్లా మార్కెటింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ సునీల్ తెలిపారు.గతేడాది 118 శాతం సెస్ వసూలు చేసినట్టు చెప్పారు.