భయపెడుతున్న మోడులు
ABN , Publish Date - Feb 24 , 2025 | 01:00 AM
గోకవరం-జగ్గంపేట ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న ఎండిన వృక్షాలు వాహనదారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. నిత్యం ఈ రోడ్డు గుండా వందలాది వాహనాలు వెళ్తుంటాయి. అటు కాకినాడతో పాటు, ఏజెన్సీ ప్రాంతాలైన గంగవరం, అడ్డతీగల తదితర ప్రాంతాలకు వెళ్లాలన్నా, ఇటు గోకవరం చేరుకోవాలన్నా ఈ రోడ్డు గుండానే ప్రయాణం చేయాల్సి ఉంది. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న రోడ్డును ఆనుకొని అక్కడక్కడ భారీ వృక్షాలు ఎంతోకాలం నుంచి ఎండిపోయి ప్రయాణికులను కలవరపాటుకు గురి చేస్తున్నాయి.

గోకవరం-జగ్గంపేట రహదారిని ఆనుకుని ఎండిపోయి ఉన్న చెట్లు
వాహనదారులకు పొంచి ఉన్న ప్రమాదం
గోకవరం, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): గోకవరం-జగ్గంపేట ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న ఎండిన వృక్షాలు వాహనదారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. నిత్యం ఈ రోడ్డు గుండా వందలాది వాహనాలు వెళ్తుంటాయి. అటు కాకినాడతో పాటు, ఏజెన్సీ ప్రాంతాలైన గంగవరం, అడ్డతీగల తదితర ప్రాంతాలకు వెళ్లాలన్నా, ఇటు గోకవరం చేరుకోవాలన్నా ఈ రోడ్డు గుండానే ప్రయాణం చేయాల్సి ఉంది. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న రోడ్డును ఆనుకొని అక్కడక్కడ భారీ వృక్షాలు ఎంతోకాలం నుంచి ఎండిపోయి ప్రయాణికులను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఎండిన చెట్లు కొమ్మలు అప్పుడప్పుడు విరిగి పడుతుండడంతో వాహన చోదకులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదవశాత్తూ చెట్టు కొమ్మ పడితే ఎంతటి భారీ వాహనమైన మరమ్మతుకు గురయ్యే పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ పొంచి ఉంది. సంబంధిత అధికారులు ప్రమాదాలు జరగక ముందే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.