ఆధార్ ఆధారంగానే ఎరువుల సరఫరా
ABN , Publish Date - Jan 07 , 2025 | 12:51 AM
రైతు లకు పురుగు మందులు సరఫరా చేసే క్రమం లో రైతు వివరాలు నమోదు చేసి ఆధారుకార్డు నెంబరు ఆధారంగానే సరఫరా చేయాలని ఆర్డీవో రాణి సుస్మిత తెలిపారు. మండలంలోని మలకపల్లిలోని ఎల్‌ఎస్‌సీఎస్ సొసైటీని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు.

మలకపల్లిలోని ఎల్‌ఎస్‌సీఎస్ సొసైటీ తనిఖీలో ఆర్డీవో రాణి సుస్మిత
తాళ్లపూడి, జనవరి 6(ఆంధ్రజ్యోతి): రైతు లకు పురుగు మందులు సరఫరా చేసే క్రమం లో రైతు వివరాలు నమోదు చేసి ఆధారుకార్డు నెంబరు ఆధారంగానే సరఫరా చేయాలని ఆర్డీవో రాణి సుస్మిత తెలిపారు. మండలంలోని మలకపల్లిలోని ఎల్‌ఎస్‌సీఎస్ సొసైటీని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భం గా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతుకు కావలసిన ఎరువులు, పురుమందులు అందేలా చర్యలు తీసుకుంటోందని, రైతు సాగు చేసే విస్తీర్ణం మెరకు ఎరువులను అందించాల్సి ఉందన్నారు. మండలం పరిధిలో అవసరం మేరకు బఫర్ స్టాకు ముందుగానే ఇండెంటు పెట్టి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో వెంట వ్యవసాయాధికారిణి రుచిత, సొసైటీ సభ్యులు ఉన్నారు.