రూ.27 అదనపు వసూలుకు రూ.27 లక్షల భారీ జరిమానా
ABN , Publish Date - Mar 05 , 2025 | 12:43 AM
కాకినాడ క్రైం, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): ఎమ్మార్పీ కన్నా అదనంగా రూ.27 వసూలు చేసినందుకు కాకినాడ వినియోగదారుల కమిషన్ రూ.27 లక్షలు భారీ జరిమానా వడ్డించింది. కమిషన్ బెంచ్ తరపున అధ్యక్షుడు చెరుకూరి రఘుపతి వసంతకుమార్, చక్కా సుశీ, చాగంటి నాగేశ్వరరావు ఈ విధంగా తీర్పు చెప్పారు. వివరాలిలా ఉన్నాయి. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండలం గంగనాపల్లికి చెందిన నున్న కుసుమ కళ్యాణ్ 2023, డిసెంబరు 8న హైదరాబాద్

కాకినాడ క్రైం, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): ఎమ్మార్పీ కన్నా అదనంగా రూ.27 వసూలు చేసినందుకు కాకినాడ వినియోగదారుల కమిషన్ రూ.27 లక్షలు భారీ జరిమానా వడ్డించింది. కమిషన్ బెంచ్ తరపున అధ్యక్షుడు చెరుకూరి రఘుపతి వసంతకుమార్, చక్కా సుశీ, చాగంటి నాగేశ్వరరావు ఈ విధంగా తీర్పు చెప్పారు. వివరాలిలా ఉన్నాయి. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండలం గంగనాపల్లికి చెందిన నున్న కుసుమ కళ్యాణ్ 2023, డిసెంబరు 8న హైదరాబాద్ బోడుప్పల్‌లో ఉన్న ట్యూలిప్స్ గ్రాండ్ హోటల్‌లో బిర్యానీలు, డ్రింకులు, మూడు మినరల్ వాటర్ బాటిల్స్ కలిపి రూ.3,083 జొమాటో డైనింగ్ పే ద్వారా చెల్లించి కొనుగోలు చేశారు. హోటల్ యాజమాన్యం రూ.20 ఎమ్మార్పీ గల వాటర్ బా టిల్‌ను ఒక్కొక్కటి రూ.29కి విక్రయించింది. మూడింటికి రూ.60కి బదులు రూ.87 వసూలు చేయడాన్ని కళ్యాణ్ గుర్తించి హోటల్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా వారి నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో బాధితుడు తన న్యాయవాదిద్వారా నోటీసు లు పంపినా హోటల్ యాజమాన్యం స్పం దించకపోవడంతో కాకినాడ వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు. అనంతరం కమిషన్ వారి సాక్ష్యాధారాలను పరిగణన లోకి తీసుకుని హోటల్ ట్యూలిప్స్ గ్రాండ్ నిర్వాహకులు దాహం తీర్చుకునే నీళ్ల బాటిల్‌పై వినియోగదారుడిపై అదనంగా రూ.9 భారం వేయడం అనైతికమని నిర్ణయించిం ది. ఈ రకంగా సమాజంలో వినియోగదారులను అన్యాయంగా దోచుకోవడం పరిపాటి అయినందున బాధితుడు కళ్యాణ్‌కు హోటల్ యాజమాన్యం రూ.25వేల నష్టపరిహారం, కోర్టు ఖర్చుల నిమిత్తం రూ.2వేలు చెల్లించడంతోపాటు తెలంగాణ సీఎం సహా య నిధికి రూ.27లక్షల భారీ జరిమానా చెల్లించాలని కమిషన్ తీర్పు ఇచ్చింది.