19న ఏజీ ఆధ్వర్యంలో పెన్షన్, జీపీఎఫ్ అదాలత్
ABN , Publish Date - Feb 15 , 2025 | 01:14 AM
జిల్లాకు సంబంధించిన పె న్షన్, జీపీఎఫ్ కేసులను సమీక్షించడానికి పెన్షన్ అదాలత్ నిర్వహిస్తున్నారని కలె క్టర్ పి.ప్రశాంతి పేర్కొన్నారు.

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): జిల్లాకు సంబంధించిన పె న్షన్, జీపీఎఫ్ కేసులను సమీక్షించడానికి పెన్షన్ అదాలత్ నిర్వహిస్తున్నారని కలె క్టర్ పి.ప్రశాంతి పేర్కొన్నారు. ఏపీ అకౌంటెంట్ జనరల్ విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ (ఏఅండ్‌ఈ) అధ్యక్షతన రాజమహేంద్రవ రంలోని ఆర్‌్ట్ర కళాశాల ప్రాంగణంలో ఉదయం 10 గంటల నుంచి ఈ అదాలత్ జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని అధికారులు, డ్రాయింగ్ అండ్ పంపిణీ అధికారులు వారి కార్యాలయాల్లో, శాఖల పరిధిలోని పెండింగ్‌లో ఉన్న పింఛను కేసులు, అనుబంధ సమస్యల వివరాలతో హాజరు కావాలన్నారు. ఈ కార్యక్రమా నికి జిల్లా ట్రెజరీ అధికారి ఎన్.సత్యనారాయణ నోడల్ అధికారిగా వ్యవహరిస్తా రని ఆమె తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.