Srisailam: శ్రీశైలానికి వరద
ABN , Publish Date - May 31 , 2025 | 03:55 AM
ఈ సంవత్సరం శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం మామూలు కంటే నెల రోజుల ముందే ప్రారంభమైంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల 64,996 క్యూసెక్కుల నీరు విడుదలైంది.
నెల రోజులు ముందుగానే నీటి ప్రవాహం
మరో 3 రోజులు వర్షాలు
పలు ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదు
నంద్యాల, మే 30(ఆంధ్రజ్యోతి): శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం మొదలైంది. ఏటా జూన్ తర్వాత జలాశయానికి వరద వచ్చేది. ఈసారి నెల రోజుల ముందుగానే వచ్చి చేరుతోంది. 3 రోజులుగా ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో శుక్రవారం సాయంత్రం 6 గంటలకి జూరాల, సుంకేసుల నుంచి 64,996 క్యూసెక్కుల నీటిని శ్రీశైలానికి విడుదల చేశారు. జూరాల స్పిల్‌వే నుంచి 49,764, విద్యుత్ ఉత్పాదన ద్వారా 5,451, సుంకేసుల నుంచి 8,824 క్యూసెక్కులు వస్తోంది. సాయంత్రానికి శ్రీశైలం జలాశయంలో 39.55 టీఎంసీల నీటి నిల్వ చేరగా, నీటి మట్టం 818.20 అడుగులకు చేరుకుంది.
ఇవి కూడా చదవండి
ప్రజలతో మమేకమవ్వండి.. నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం
ఫేస్‌బుక్ పరిచయం.. యువతికి లంచ్ ఆఫర్.. చివరకు
Read Latest AP News And Telugu News