Share News

Kakinada: కుమారుడి ముక్కు నోటికి ప్లాస్టర్‌

ABN , Publish Date - Jun 05 , 2025 | 05:46 AM

కొడుకుకి ఊపిరాడకుండా ముక్కుకి, నోటికి ప్లాస్టర్లు వేసి, తాను ఫ్యానుకు ఉరి వేసుకుంది. కాకినాడలో బుధవారం జరిగిన ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Kakinada: కుమారుడి ముక్కు నోటికి ప్లాస్టర్‌

నాలుగేళ్ల కొడుకును చంపి.. ఆపై తల్లి ఆత్మహత్య

కాకినాడ క్రైం, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): కుటుంబ కలహాల నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ మహిళ నాలుగేళ్ల కుమారుడిని చంపి, తానూ ఆత్మహత్య చేసుకుంది. కొడుకుకి ఊపిరాడకుండా ముక్కుకి, నోటికి ప్లాస్టర్లు వేసి, తాను ఫ్యానుకు ఉరి వేసుకుంది. కాకినాడలో బుధవారం జరిగిన ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కాకినాడ రేచర్లపేటలోని దౌర్ల వారి వీధికి చెందిన రాజాల రమ్యదీప్తి (30), శరత్‌బాబు దంపతులు. వీరికి సియాన్‌ ప్రశాంత్‌ (4) అనే కుమారుడు ఉన్నాడు. దంపతులిద్దరూ కొంతకాలంగా గల్ఫ్‌లోని అబుదాబిలో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. రమ్యదీప్తి పదిరోజుల క్రితం రేచర్లపేటలోని అత్తారింటికి వచ్చింది. డబ్బు సంపాదించడం మానేసి అక్కడి నుంచి వచ్చేస్తావా అంటూ అత్త శాంతి, ఆడపడుచు మెర్సీ మానసికంగా రమ్యదీప్తిని వేధింపులకు గురి చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రమ్యదీప్తి తనువు చాలించాలని నిర్ణయించుకుంది. బుధవారం ఉదయం ఎంతకీ తలుపులు తీయకపోవడంతో అనుమానంతో కుటుంబ సభ్యులు కిటికీలోంచి చూశారు. రమ్యదీప్తి ఫ్యానుకు వేలాడుతూ, కొడుకు నోటికి, ముక్కుకి ప్లాస్టర్‌తో విగతజీవులుగా కనిపించారు. టూటౌన్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


For AndhraPradesh News And Telugu News

Updated Date - Jun 05 , 2025 | 07:13 AM