Political Discussion: చంద్రబాబుతో పవన్ భేటీ
ABN , Publish Date - Mar 04 , 2025 | 04:38 AM
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో సోమవారం ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
ఎమ్మెల్సీ అభ్యర్థులు, తల్లికి వందనం,
అన్నదాత సహా పలు అంశాలపై చర్చ
సీఎం చాంబర్లో గంటపాటు సమావేశం
బడ్జెట్ కేటాయింపులు బాగున్నాయ్
అభివృద్ధి, సంక్షేమం బ్యాలెన్స్: జనసేనాని
అమరావతి, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో సోమవారం ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మధ్యాహ్నం 1.30 గంటలకు అసెంబ్లీ హాలు నుంచి నిష్క్రమించారు. ఇద్దరూ కలిసి సీఎం చాంబరుకు వెళ్లారు. సుమారు గంటపాటు వివిధ అంశాలపై చర్చించుకున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీల ఎన్నికలపై మాట్లాడుకున్నారు. పవన్ సోదరుడు నాగబాబుకు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం ఖరారవగా.. మిగిలిన 4 స్థానాలకు అభ్యర్థుల ఎంపికపైనా ఉభయులూ చర్చించినట్లు సమాచారం. కాగా.. రాష్ట్ర బడ్జెట్‌లో వివిధ శాఖలకు కేటాయింపులు బాగున్నాయని, అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను బ్యాలెన్స్ చేస్తూ కేటాయించారని పవన్ ఈ సందర్భంగా పేర్కొన్నట్లు తెలిసింది. మే నెల నుంచి ప్రారంభించే తల్లికి వందనం, అన్నదాత పథకాలపైన చర్చించినట్లు సమాచారం.