Share News

Vijayawada: ‘విద్యాశక్తి’ని విజయవంతం చేయండి

ABN , Publish Date - Jun 25 , 2025 | 05:51 AM

చదువులో వెనకబడిన పిల్లల కోసం రూపొందించిన ప్రత్యేక బోధనా తరగతుల కార్యక్రమం ‘విద్యాశక్తి’ని ఉపాధ్యాయులు విజయవంతం చేయాలని పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్‌ వి.విజయరామరాజు కోరారు.

 Vijayawada: ‘విద్యాశక్తి’ని విజయవంతం చేయండి

  • పాఠశాల విద్య డైరెక్టర్‌ విజయరామరాజు

అమరావతి, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): చదువులో వెనకబడిన పిల్లల కోసం రూపొందించిన ప్రత్యేక బోధనా తరగతుల కార్యక్రమం ‘విద్యాశక్తి’ని ఉపాధ్యాయులు విజయవంతం చేయాలని పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్‌ వి.విజయరామరాజు కోరారు. విద్యాశక్తిపై మంగళవారం విజయవాడలో ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సబ్జెక్టుల్లో వెనకబడిన విద్యార్థులకు పాఠశాలల పనివేళల అనంతరం అదనపు బోధనా తరగతులు నిర్వహించాలన్నారు. అభ్యసన సామర్థ్యాలు పెంచడం, డ్రాపౌట్లను తగ్గించడం, జీఈఆర్‌ పెంచడం లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు.

Updated Date - Jun 25 , 2025 | 05:51 AM