Share News

Devineni Uma On YS Jagan: జగన్ పాలనపై దేవినేని ఉమా సంచలన ఆరోపణలు

ABN , Publish Date - Aug 01 , 2025 | 09:19 PM

గత ఐదేళ్ల జగన్ పాలనపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా నిప్పులు చెరిగారు.

Devineni Uma On YS Jagan: జగన్ పాలనపై దేవినేని ఉమా సంచలన ఆరోపణలు
TDP Leader Devineni Uma

విజయవాడ, ఆగస్ట్ 01: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఐదేళ్ల పాలనలో మాఫియా రాజ్యం - ఇసుక, మద్యం దోపిడీపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా సంచలన ఆరోపణలు చేశారు. శుక్రవారం విజయవాడలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. "ఒక వైపు ఇసుక దోపిడీ, మరో వైపు మద్యం దందా.. ఇది వైఎస్ జగన్ హయాంలో జరిగిన రాజకీయ మాఫియాకు స్పష్టమైన ఉదాహరణ అని పేర్కొన్నారు.


ఇసుక అక్రమ తవ్వకాలపై సిట్, ఉపగ్రహ చిత్రాల ఆధారంగా ఈ విషయం వెల్లడైందన్నారు. ఇప్పటి వరకు 1.22 కోట్ల టన్నుల అక్రమ తవ్వకాలు బహిర్గతమయ్యాయని తెలిపారు. ఇంకా 2.69 కోట్ల టన్నుల వివరాలు తేలాల్సి ఉందని చెప్పారు. దీని మొత్తం విలువ రూ. 4,000 కోట్లకు పైగా ఉంటుందని చెప్పారు. ఇసుక దోపిడీకి వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డితోపాటు ఆయన కుమారుడు.. వారి ముఠా కీలక పాత్ర పోషించారని ఆరోపించారు.


వీరిపై సిట్ విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వరకు స్కామ్‌ల వలయమని పేర్కొన్నారు. గతంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్‌లో ప్రభుత్వ భూములు కారుచౌకగా కొట్టేసి విల్లాలు, అపార్ట్‌మెంట్లు నిర్మించారని విమర్శించారు. ఒక్క కృష్ణా జిల్లాలోనే నెలకు రూ. 22 కోట్లు తాడేపల్లి ప్యాలెస్‌కు కప్పం కట్టారని ధ్వజమెత్తారు.


పెట్టెలు పెట్టెలుగా నగదు తరలించారని.. ఆ డబ్బు కంటైనర్లు ఎక్కడికి వెళ్లాయి? అంటూ వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ను ఆయన సూటిగా ప్రశ్నించారు. బెంగళూరు ప్యాలెస్‌లో ఎంతెంత నల్లధనం దాచారో తేలాల్సి ఉందన్నారు. మంత్రుల ఇళ్ళపై మా వాళ్ళను పంపిస్తాం.. హత్యలు మొదలుపెడతామంటూ వైఎస్ జగన్ చేస్తున్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఇలాంటి పిచ్చి ప్రేలాపనలు మాట్లాడే 11 సీట్లకు పరిమితమయ్యారంటూ వైసీపీ అధినేతతోపాటు ఆ పార్టీ నేతలకు మాజీ మంత్రి దేవినేని ఉమా చురకలంటించారు.


మరోవైపు మద్యం కుంభకోణం వ్యవహారంలో హైదరాబాద్‌లో దాదాపు రూ. 11 కోట్లను ఏపీ సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పెట్టల్లో నగదు దొరికింది.. మరి కంటైనర్లలో నగదు ఎక్కడ అంటూ దాచారంటూ వైసీపీ అగ్రనేత వైఎస్ జగన్‌ను గురువారం ప్రెస్ మీట్‌లో దేవినేని ఉమా ప్రశ్నించిన సంగతి తెలిసిందే.

ఈ వార్తలు కూడా చదవండి..

బాలయ్యకు అభినందనల వెల్లువ.. స్పందించిన దర్శక నిర్మాతలు

ఆసుపత్రిలో చేరిన 150 విద్యార్థులు.. పలువురి పరిస్థితి ఆందోళనకరం

For More AP News and Telugu News

Updated Date - Aug 01 , 2025 | 09:19 PM