Bhagavanth Kesari: బాలయ్యకు అభినందనల వెల్లువ.. స్పందించిన దర్శక నిర్మాతలు
ABN , Publish Date - Aug 01 , 2025 | 08:54 PM
భగవంత్ కేసరి జాతీయ తెలుగు చలన చిత్రంగా ఎంపిక కావడంపై ఆ చిత్ర హీరో నందమూరి బాలకృష్ణకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే ఈ చిత్ర నిర్మాత, దర్శకులు సైతం స్పందించారు.
అమరావతి, ఆగస్ట్ 01: అనిల్ రావిపూడి దర్శకత్వంలో నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర హీరో నందమూరి బాలకృష్ణకు పలువురి ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ చిత్రం 2023, అక్టోబర్ 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. హీరో బాలకృష్ణ, కాజల్ అగర్వాల్, అర్జున్ రాంపాల్, శ్రీలీల ప్రధాన తారాగణంగా నటించారు. ఈ చిత్రానికి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
ఉత్తమ చిత్రంగా ఎంపిక.. స్పందించిన సీఎం చంద్రబాబు..
తెలుగు సినీ హీరో, పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమాకు 2023 సంవత్సరానికి గాను జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా అవార్డు రావడం ఆనందంగా ఉందన్నారు. నాడు ప్రేక్షకాదరణ పొందిన ఈ చిత్రానికి ఇప్పుడు అవార్డులు కూడా రావడం గొప్ప విషయమని పేర్కొన్నారు. నందమూరి బాలకృష్ణ గారెకి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఏపీ ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ..
71వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో బాలా మామయ్య హీరోగా నటించిన భగవంత్ కేసరి జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపిక కావడం చాలా సంతోషం. బాలా మామయ్య నటన, సందేశాత్మక చిత్రంగా ప్రేక్షకుల మన్ననలు అందుకున్న భగవంత్ కేసరికి నేషనల్ అవార్డు వచ్చిన సందర్భంగా బాలా మామయ్యకు, డైరెక్టర్ అనిల్ రావిపూడి గారికి, చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.
దర్శకుడు అనిల్ రావిపూడి రియాక్షన్..
భగవంత్ కేసరి చిత్రం ఉత్తమ చిత్రంగా ఎంపిక కావడంపై ఆ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గారపాటి ఏబీఎన్‌తో మాట్లాడుతూ.. భగవంత్ కేసరి చిత్రం అటు ప్రేక్షకాదరణ.. ఇటు అవార్డులు రెండు అందుకుందని తెలిపారు. హీరో బాలయ్య బాబు మమల్ని ఎంతో సపోర్ట్ చేశారని గుర్తు చేసుకున్నారు. కథను నమ్మి మేము చేసిన ఈ ప్రయత్నానికి గుర్తింపు లభించటం చాలా ఆనందంగా ఉందన్నారు.
ప్రతి సినిమాను బాధ్యతగా చేస్తామని.. కానీ ఇప్పుడు అది మరింత పెరిగిందన్నారు. ఈ అవార్డు మా ఉత్సాహాన్ని పెంచిందని పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ఓ బ్లాక్ బస్టర్ హిట్.. ఇప్పుడు ఈ అవార్డ్ రావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. వచ్చే సంక్రాంతికి మెగా స్టార్ చిరంజీవి హీరోగా చిత్రం విడుదల కానుందన్నారు. ఈ చిత్రం సైతం అందరిని అలరిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
నిర్మాత సాహు గారపాటి రియాక్షన్..
ఈ చిత్ర నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ.. మరిన్ని మంచి సినిమాలు చేయాలనే ఉత్సాహాన్ని ఈ నేషనల్ అవార్డ్ మాకు ఇచ్చిందన్నారు. మా సినిమాను గుర్తించిన నేషనల్ అవార్డ్ జ్యూరీ సభ్యులకు ధన్యవాదాలు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గుడ్‌న్యూస్.. విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం కీలక ప్రకటన
ఆసుపత్రిలో చేరిన 150 విద్యార్థులు.. పలువురి పరిస్థితి ఆందోళనకరం
For More AP News and Telugu News