Delhi High Court: సోషల్ మీడియాలో ట్రోలింగ్స్.. హైకోర్టును ఆశ్రయించిన పవన్ కల్యాణ్
ABN , Publish Date - Dec 12 , 2025 | 12:25 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సోషల్ మీడియా వేదికగా తన వ్యక్తిత్వ, హక్కులను ఉల్లంఘించేలా వ్యవహరిస్తున్నారని అంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. పవన్ కల్యాణ్ తరఫున సీనియర్ న్యాయవాది సాయి దీపక్ పిటిషన్ దాఖలు చేశారు.
న్యూఢిల్లీ: ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. అయితే, సోషల్ మీడియా అతి వాడకం వల్ల ఎక్కువ శాతం మంది జీవితాలు అగమ్యగోచరంగా తయారు అయ్యాయి. సోషల్ మీడియాకు అడిక్ట్ అయిపోయిన జనం జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కొంతమంది సోషల్ మీడియాను అడ్డాగా చేసుకుని సెలెబ్రిటీలపై దారుణమైన పోస్టులు పెడుతున్నారు. అసభ్యకరమైన పోస్టులతో పెచ్చు మీరి విలయతాండవం చేస్తున్నారు. సెలెబ్రిటీల పర్సనల్ విషయాలపై కూడా పోస్టులు పెడుతున్నారు. వారి పరువుకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సెలెబ్రిటీలు కోర్టులను ఆశ్రయిస్తున్నారు.
ఢిల్లీ హైకోర్టుకు ఉప ముఖ్యమంత్రి
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సోషల్ మీడియా వేదికగా తన వ్యక్తిత్వ, హక్కులను ఉల్లంఘించేలా వ్యవహరిస్తున్నారని అంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పోస్టుల కారణంగా తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుందని పిటిషన్‌లో పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ తరఫున సీనియర్ న్యాయవాది సాయి దీపక్ పిటిషన్ దాఖలు చేశారు. వారం రోజుల్లో ఉల్లంఘనకు సంబంధించిన వివరాలను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని మెటా, గూగుల్, ఎక్స్‌కు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ డిసెంబర్ 22కు వాయిదా వేసింది.
ఏబీఎన్ ఎఫెక్ట్.. భారీగా నిధుల విడుదల..
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. పోలవరం మండలంలోని ఐదు గ్రామాలకు చెందిన రహదారుల సమస్యలపై ఆయన దృష్టి సారించారు. గవరవరం, గంగన్నగూడెం, తిమ్మన కుంట, కృష్ణంపాలెం ఏడువాడల పాలెం రహదారుల నిర్మాణం కోసం 7.40 కోట్ల రూపాయల్ని పవన్ కల్యాణ్ మంజూరు చేశారు. దీంతో ఆ గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ప్రేమ పేరుతో మోసం.. యువతిపై ముగ్గురు అత్యాచారం..
టీడీపీ నేత సంచలన కామెంట్స్.. జగన్.. ఏపీ మాఫియా డాన్